Skip to main content

KGBV Jobs: పాఠశాలల్లో ఖాళీగా ఉన్న పోస్టులకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌

జనగామ రూరల్‌: కేజీబీవీలు, యూఆర్‌ఎస్‌ అభ్యర్థుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ ఆగ‌స్టు 11న‌ చేపట్టారు.
KGBV Jobs
పాఠశాలల్లో ఖాళీగా ఉన్న పోస్టులకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌

 కేజీబీవీ, యూఆర్‌ఎస్‌ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న వివిధ పోస్టులకు ఆగ‌స్టు 11న‌ ఆన్‌లైన్‌లో అప్లికేషన్లు స్వీకరించిన అనంతరం పరీక్ష నిర్వహించగా.. ప్రభుత్వం ఆగ‌స్టు 10న‌ఫలితాలు వెల్లడించింది. జిల్లా వ్యాప్తంగా 42 పోస్టులకు 126 మంది అర్హత సాధించగా.. 1:3 ప్రకారం అభ్యర్థులకు ఫోన్‌ ద్వారా సమాచారం అందించారు. జిల్లా కేంద్రంలోని ప్రెస్టెన్‌ పాఠశాలలో అధికారులు సర్టిఫికెట్లను పరిశీలించా రు.

చదవండి: KGBV Posts: ఉద్యోగాలకు ఎంపికై న వారి జాబితా విడుదల

సీఆర్టీ, పీజీ సీఆర్‌ర్టీ, ఎస్‌ఓ పోస్టులకు అభ్యర్థులు హాజరు కాగా.. దూర ప్రాంతంలో ఉన్నవారు హడావుడిగా వచ్చి ఇబ్బంది పడ్డారు. అలాగే ఇదే రోజు గురుకులం తదితర పరీక్షలు ఉండడంతో కొంత ఆలస్యంగానైన వెరిఫికేషన్‌ పూర్తి చేశారు. మెరిట్‌ జాబితాను www.deojangaon.com వెబ్‌సైట్‌లో పొందుపరిచారు. శనివారం మధ్యాహ్నం 2 గంటల వరకు అభ్యంతరాలు స్వీకరించి ఆగ‌స్టు 13న‌ పోస్టింగ్‌లు ఇస్తామని, అదేరోజు జాయిన్‌ కావాలని డీఈఓ రాము, ఇన్‌చార్జ్‌ గౌసియా తెలిపారు.

చదవండి: ‘KGBV’ మెరిట్‌ జాబితా విడుదల

Published date : 12 Aug 2023 04:13PM

Photo Stories