Skip to main content

Jobs in Telangana: ఈ ఉద్యోగాల‌కు పోటెత్తిన దరఖాస్తులు!.. ఖాళీలు, దరఖాస్తులు ఇలా..

నిజామాబాద్‌ నాగారం: జిల్లా వైద్యారోగ్య శాఖలో ఖాళీలను భర్తీ చేయడానికి దరఖాస్తులను ఆహ్వానించగా అభ్యర్థుల నుంచి భారీ స్పందన వచ్చింది.
Applications for vacancies in the District Health Department   MLHP Application Invitation

ఔట్‌సోర్సింగ్‌, కాంట్రాక్టు ఇలా ఏ ఉద్యోగం అయి నా తీవ్రంగా పోటీ నెలకొంది. జిల్లాలో నిరుద్యోగులు అధిక మొత్తంలో ఉండడంతో ఏ నోటిఫికేషన్‌ వచ్చినా పోటాపోటీగా దరఖాస్తులు చేసుకుంటున్నారు. వైద్యారోగ్యశాఖ ఎంఎల్‌హెచ్‌పీ, ఎంబీబీఎస్‌, స్టాఫ్‌ నర్సులు, ఫార్మసిస్టు, డీఈవో, డీఈవో అకౌంటెంట్‌, జీఎన్‌ఎం, ఏఎఎం, డెంటల్‌ టెక్నిషియన్‌పోస్టుల ప్రకటన వెలువడిన విషయం తెలిసిందే.

మార్చి 2 నుంచి 7వరకు కలెక్టరేట్‌లోని వైద్యారోగ్యశాఖ కార్యాలయంలో దరఖాస్తులు చేసుకోవడానికి అవకాశం కల్పించారు. దీంతో జిల్లా నలుమూలాల నుంచి పెద్ద ఎత్తున అర్హత ఉన్న నిరుద్యోగులు దరఖాస్తులు చేసుకున్నారు. పోస్టులు పదుల సంఖ్యలో వందల్లో దరఖాస్తులు వచ్చాయి.

చదవండి: Nurse Posts: స్విమ్స్‌ ఆస్పత్రుల్లో నర్సు పోస్టుల భర్తీ

భర్తీ ప్రక్రియపై అనుమానాలు

ఔట్‌సోర్సింగ్‌, కాంట్రాక్టు పద్ధతిలోనే నియామకాలు చేపట్టనున్నారు. అయితే ఈ ప్రక్రియ ఏ విధంగా చేపడుతారోనని అభ్యర్థులు ఆందోళనకు గురవుతున్నాయి. మెరిట్‌ పద్ధతి ప్రకారమే పోస్టులు భర్తీ చేస్తామని అధికారులు చెబుతున్నా.. అభ్యర్థుల్లో మాత్రం లెక్క లెనన్ని అనుమాలు వ్యక్తం అవుతున్నాయి.

గతంలో మెరిట్‌ పద్ధతి పేరు చెప్పి ఇష్టారాజ్యాంగా భర్తీ చేయడంతో కలెక్టర్‌ వరకు ఫిర్యాదులు వెళ్లాయి. కలెక్టర్‌ సీరియస్‌ కావడంతో మళ్లీ ప్రక్రియను చేపట్టి న్యాయబద్దంగా నియమకాలు జరిగేలా చొరవ చూపారు. ఇప్పుడు అధికారులు ఏలా భర్తీ చేస్తారరోని అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. రోస్టర్‌ ప్రకారం భర్తీ చేస్తే అందరికి న్యాయం జరుగుతుందంటున్నారు.

చదవండి: Singareni Jobs: సింగరేణి ఉద్యోగులకు గోల్డెన్‌ చాన్స్‌

పోస్టులు

ఖాళీలు

 దరఖాస్తులు

స్టాఫ్‌ నర్సులు

30

1340

డీఈవో

1

150

డీఈవో అకౌంటెంట్‌

 3

74

ఎంబీబీఎస్‌– మేల్‌

 3

 3

ఎంబీబీఎస్‌– ఫిమేల్‌

 8

9

ఫార్మసిస్టు

6

378

డెంటల్‌ టెక్నీషియన్‌

1

1

ఎంఎల్‌హెచ్‌పీ

43

 139

ఆర్‌బీఎస్‌కే వైద్యులు

5

15

మెరిట్‌ ప్రకారమే భర్తీ చేస్తాం..
అభ్యర్థులు ఎలాంటి ఆందోళన చెందవద్దు. మెరిట్‌ పద్ధతిలోనే భర్తీ చేయడానికి చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పటికే దరఖాస్తులను ఆన్‌లైన్‌ చేస్తున్నారు. విద్యార్హత, సర్టిఫికెట్ల పరిశీలన చేస్తున్నాం. దరఖాస్తు గడువు మార్చి 11న‌ ముగిసింది. అభ్యర్థులు దళారులను నమ్మి మోసపోవద్దు. నియామకాల విషయంలో దళారులు, పైరవీకారులు, రికమండేషన్స్‌ అంగీకరించాం. దరఖాస్తుదారులకు పైరవీలకు సంబంధించిన సమాచారం తెలిస్తే మా కార్యాలయంలో తెలియజేయాలి.
– సుదర్శనం, డీఎంహెచ్‌వో

Published date : 13 Mar 2024 11:20AM

Photo Stories