Skip to main content

Department of Handlooms & Textiles: పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం

సాక్షి, అమరావతి: జాతీయ చేనేత అభివృద్ధి పథకం కింద రాష్ట్రంలోని శ్రీకాకుళం జిల్లా పరిధిలో ఉపాధి కల్పన కార్యక్రమంలో తాత్కాలిక ప్రాతిపదికన ఆరు పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు రాష్ట్ర చేనేత, జౌళి శాఖ కమిషనర్‌ కె.శ్రీకాంత్‌ ప్రభాకర్‌ డిసెంబర్‌ 8న ఒక ప్రకటనలో తెలిపారు.
Department of Handlooms & Textiles
రాష్ట్ర చేనేత, జౌళి శాఖలో పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం

మూడు టెక్స్‌టైల్‌ డిజైనర్, మూడు క్లస్టర్‌ డెవలప్‌మెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ పోస్టులకు డిసెంబర్‌ 31వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. క్లస్టర్‌ డెవలప్‌మెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ పోస్టుకు హ్యాండ్లూమ్‌ టెక్నాలజీలో డిపొ్లమా పూర్తిచేయడంతోపాటు రెండేళ్ల అనుభవం, కంప్యూటర్‌ పరిజ్ఞానం ఉండాలని తెలిపారు.

చదవండి: SSC-CHSL Exam 2022 Notification: స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌(ఎస్‌ఎస్‌సీ)లో 4500 పోస్టులు.. పూర్తి వివ‌రాలు ఇవే..

టెక్స్‌టైల్‌ డిజైనర్‌ పోస్టుకు టెక్స్‌టైల్‌ డిజైన్‌ కోర్సు ఉత్తీర్ణులవడంతోపాటు చేనేత విభాగంలో రెండేళ్ల అనుభవం ఉండాలని పేర్కొన్నారు. అర్హత, అనుభవం, వయసు, స్థానిక నివాసం ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తామని వివరించారు.

చదవండి: KVS Recruitment 2022: కేంద్రీయ విద్యాలయాల్లో 6,414 ప్రైమరీ టీచర్‌ పోస్టులు.. ఎవరు అర్హులంటే..

మూడేళ్లపాటు తాత్కాలిక ప్రాతిపదికన పనిచేసేందుకు ఆసక్తిగల అభ్యర్థులు తమ దరఖాస్తులను డిసెంబర్‌ 31వ తేదీలోపు కమిషనర్, చేనేత, జౌళి శాఖ, 4వ అంతస్తు, ఐహెచ్‌సీ కార్పొరేట్‌ బిల్డింగ్, ఆటోనగర్, మంగళగిరి, గుంటూరు జిల్లా, పిన్‌ కోడ్‌–522503 అనే చిరునామాకు పంపించాలని సూచించారు. పూర్తి వివరాలకు www.aphandtex.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించారు. 

చదవండి: AP Govt Jobs: ఆంధ్రప్రదేశ్‌లో 1458 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల... ఎవరు అర్హులంటే..

Published date : 09 Dec 2022 01:32PM

Photo Stories