Skip to main content

SI Posting: ఎస్ఐగా మొదటి పోస్టింగ్‌.. ఇక్క‌డే..?

ఎస్‌ఐగా ఎదగాలని కష్టపడి పరీక్షలు రాసి, మొత్తానికి మంచి మార్కులతో ఎస్‌ఐగా ఎంపికైంది ఈ యువతి. ప్రస్తుతం, ఈ స్టేషన్‌లో ఎస్‌ఐగా పోస్టింగ్‌ జరిగింది..
Daughter first posting to Father's station  SI success story

ఒక ఎస్‌ఐ బదిలీ అవుతూ బాధ్యతలను తన కూతురికి అప్పగించారు. ఆమె కూడా ఎస్‌ఐగా పనిచేస్తుండడం విశేషం. ఈ వినూత్న సంఘటన మండ్యలో జరిగింది. మండ్య సెంట్రల్‌ పోలీసు స్టేషన్‌లో ఎస్‌ఐ బీఎస్‌ వెంకటేశ్‌ ఎస్పీ ఆఫీసుకు బదిలీ అయ్యారు. ఆయన స్థానంలోకి కొత్త ఎస్‌ఐగా బీవీ వర్ష నియమితులయ్యారు. ఆమె ఎవరో కాదు.. వెంకటేశ్‌ కూతురే.

AP SI Job Selected Candidates: ప‌ట్టుద‌ల‌తో శ్ర‌మించారు.. ఎస్‌ఐ ఫ‌లితాల్లో విజ‌యం సాధించారు.. వారు వీరే..

తొలి పోస్టింగ్‌ కూడా..!

ఎంఏ అర్థశాస్త్రం చదివిన వర్ష 2022 బ్యాచ్‌లో కలబురిగిలో శిక్షణ తీసుకుని ట్రైనీ ఎస్‌ఐగా ఇదే పీఎస్‌లో పనిచేశారు. తొలి పోస్టింగ్‌ కూడా మండ్యలోనే జరగడం గమనార్హం. అది కూడా తండ్రి పని చేసి బదిలీ అయిన మండ్య సెంట్రల్‌ పోలీసు స్టేషన్‌కే. బుధవారం తన తండ్రి వెంకటేశ్‌ నుంచే వర్ష చార్జ్‌ తీసుకుని పూర్తిస్థాయి ఎస్‌ఐగా నియమితులయ్యారు. ఈ సందర్భంగా తండ్రీ కూతురు స్టేషన్‌లోని సిబ్బందికి స్వీట్లు పంచి వేడుక చేసుకున్నారు.

Published date : 25 Dec 2023 07:57PM

Photo Stories