Skip to main content

TET 2022: పరీక్ష తేదీలు విడుదల.. దరఖాస్తు చివరి తేదీ ఇదే..

ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌) ను జూన్ 12వ తేదీన నిర్వహించనున్నట్టు ప్రభుత్వం మార్చి 24న తెలిపింది.
TET 2022
టెట్ పరీక్ష తేదీలు విడుదల.. దరఖాస్తు చివరి తేదీ ఇదే..

ఇందుకు సంబంధించిన నోటి ఫికేషన్ ను విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు మార్చి 26వ తేదీ నుంచి వచ్చే ఏప్రిల్‌ 16వ తేదీ వరకూ ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని పాఠశాల విద్య (ఎస్‌సీఈఆర్‌టీ) డైరెక్టర్‌ రాధారెడ్డి సంబంధిత ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. సమగ్ర వివరాలతో కూడిన నోటిఫికేషన్ ను మార్చి 25వ తేదీన ‘టీఎస్‌టెట్‌. సీజీజీ.జీవోవీ.ఇన్’వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతున్నట్టు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో 13,086 పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో 10 వేల వరకూ బోధన సిబ్బంది ఖాళీలే ఉన్నాయి. వీరిలో 6,700 మంది సెకండరీ గ్రేడ్‌ ఉపాధ్యాయులను భర్తీ చేయాల్సి ఉంది. డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్‌ (డీఈడీ), బ్యాచిలర్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్ (బీఈడీ) పూర్తి చేసిన వారు టెట్‌ రాసేందుకు అర్హు లు. ఇందులో అర్హత పొందిన వారు ప్రభుత్వం ఖాళీల భర్తీకి చేపట్టే టీచర్స్‌ రిక్రూట్‌మెంట్‌ పరీక్షలో 20% వెయిటేజీ పొందుతారు. ప్రైవేటు విద్యా సంస్థల్లో బోధనకు కూడా దీన్ని ప్రామాణికంగా తీసుకుంటారు.

చదవండి: 

అభ్యర్థులకు శుభ‌వార్త‌.. ! ఇక‌పై టెట్‌ ఒక్కసారి రాస్తే..

టెట్‌పై మంత్రి సబిత క్లారిటీ ఇదే.. త్వ‌ర‌లోనే వర్సిటీల్లో ప్రొఫెసర్ల పోస్టులు భర్తీ

కచ్చితంగా ఉద్యోగం సాధించాలనుకునే వారికి మాత్రమే..

ఏడేళ్లు కాదు..జీవిత కాలం అర్హత

టెట్‌కు సంబంధించి ఇటీవల మంత్రుల కమిటీ చేసిన కొన్ని సవరణలను ప్రభుత్వం ఆమోదించింది. గతం లో టెట్‌లో సాధించిన అర్హత కాలపరిమితి ఏడేళ్లుగా ఉండేది. దీన్ని ఇప్పుడు జీవితకాలానికి పొడిగించారు. జాతీయ ఉపాధ్యాయ మండలి (ఎన్ సీటీఈ) రెండేళ్ళ క్రితం ఈ మేరకు మార్పులు చేయగా.. రాష్ట్ర ప్రభుత్వం కూడా దీనికి అనుగుణంగా మార్పులు చేసింది. దీని ప్రకారం 2011 ఫిబ్రవరి 11వ తేదీ నుంచి ఆ మార్పు వర్తిస్తుంది. అంటే అప్పటినుంచి జరిగిన టెట్‌లో అర్హత సాధించిన వారి ధ్రువపత్రం ఇప్పుడూ చెల్లుబాటు కానుంది. రాష్ట్రంలో ఇప్పటికే టెట్‌ పాసైనవారు సుమారు 3 లక్షల మంది ఉంటారని అంచనా. కాగా టెట్‌ను 150 మార్కులకు నిర్వహిస్తారు. జనరల్‌ కేటగిరీ విద్యార్థులకు 90 మార్కులు (60 శాతం), బీసీలకు 75 మార్కులు (50 శాతం), ఎస్‌సీ, ఎస్‌టీ, దివ్యాంగులకు 60 మార్కులు (40 శాతం) వస్తే అర్హత సాధించినట్లుగా పరిగణిస్తారు. పేపర్‌–1 పరీక్ష ఉదయం 9.30 నుంచి 12.00 వరకు, పేపర్‌–2 మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.00 గంటల వరకు జరుగుతుంది. 

ఐదేళ్ల తర్వాత మళ్లీ..

  • రాష్ట్ర ఆవిర్భావం తర్వాత 2016 మేలో, మళ్లీ 2017 జూలైలో టెట్‌ నిర్వహించారు. డీఈడీ చేసిన వారికి పేపర్‌–1 కింద, బీఈడీ చేసిన వారికి పేపర్‌–2 (రెండు సబ్జెక్టులు)గా పరీక్ష నిర్వహిస్తారు. ఈ విధంగా 2017లో నిర్వహించిన టెట్‌కు 3,67,912 మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారు. పేపర్‌–1 (డీఎడ్‌)కు 98,848 మంది హాజరైతే వీరిలో 56,708 (57.37 శాతం) మంది అర్హత సాధించారు. పేపర్‌–2 (సైన్స్)కు 1,11,018 మంది హాజరైతే 20,233 (18.31 శాతం) మంది అర్హత సాధించారు. పేపర్‌–2 (సోషల్‌) 1,19,914 మంది పరీక్ష రాస్తే వారిలో 24,732 (20.62 శాతం) మంది అర్హత పొందారు. అన్ని విభాగాల్లో కలిపి వివిధ కారణాలతో 1,632 మంది విత్‌హెల్డ్‌గా ప్రకటించారు. తాజాగా పెద్ద ఎత్తున ఉపాధ్యాయ నియామకాలు చేపడతుండటంతో ఈసారి అభ్యర్థుల సంఖ్య భారీగా పెరిగే వీలుందని భావిస్తున్నారు. 
Published date : 25 Mar 2022 03:16PM

Photo Stories