DSC 2024: డీఎస్సీలో అర్హతల పంచాయితీ
కానీ, పెద్దపల్లి డీఎస్సీలో పోస్టులు లేవు. దీంతో, కరీంనగర్ పోస్టులకు పరీక్ష రాశాడు. ఇందుకోసం 1 నుంచి 5వ తరగతి వరకు కరీంనగర్‌లోని రాంనగర్ అరుణోదయ ప్రైమరీ స్కూల్లో చదువుకున్నట్లు దరఖాస్తు చేసుకున్నాడు. సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తయింది. అతను నాన్‌లోకల్ అయినా కరీంనగర్‌కు లోకల్ కేండిడేట్‌గా పరీక్ష రాసేందుకు రాంనగర్‌లో చదువుకున్నట్లు సర్టిఫికెట్లు తెచ్చాడన్న ఆరోపణలున్నాయి.
చదవండి: DSC 2024: కొత్త టీచర్లు వస్తున్నారు.. కొత్తగా ఇంత మందికి పోస్టింగ్
ఇదే వ్యక్తి గ్రూప్–1, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్, గ్రూప్–4 పరీక్షలకు దరఖాస్తు చేసుకున్నాడు. వాటిలో తాను పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలంలోని సుల్తాన్‌పూర్‌లో ప్రాథమిక విద్య పూర్తి చేసినట్లు పేర్కొన్నాడు. ఇందుకు సంబంధించి అతని దరఖాస్తులను పలువురు అభ్యర్థులు చూపిస్తున్నారు. అవి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఒకే వ్యక్తి రెండు జిల్లాల్లో స్థానికుడిగా ఎలా పరీక్షలు రాస్తాడని జిల్లా ఉన్నతాధికారులను పలువురు నిలదీస్తున్నారు.
▶ Join our WhatsApp Channel: Click Here ▶ Join our Telegram Channel: Click Here |
▶ Follow our YouTube Channel: Click Here ▶ Follow our Instagram Page: Click Here |
రావుల స్వాతి.. కరీంనగర్ జిల్లా నుంచి బీఈడీ చేసింది. 2012లో టెట్ పాసైంది. ఆమెకు స్పెషన్ ఎడ్యుకేషన్ ఇన్ డిప్లొమా ఉంది. స్పెషల్ బీఈడీ కోర్సులో చేరినా పూర్తి కాలేదు. అయినా, ఆమె పేరు తాజా ఉపాధ్యాయ నియామకాలకు సంబంధించిన 1:3 లిస్టులో ఉంది. అసలు స్పెషల్ బీఈడీ పూర్తి చేయకుండా టెట్ రాయడం నిబంధనలకు విరుద్ధమని, కేవలం 2024 సంవత్సరం డీఎస్సీ కోసం దరఖాస్తు చేసిన ప్రామాణిక అప్లికేషన్‌లో ఎంటర్ చేసిన వాటిని మాత్రమే పరిగణలోకి తీసుకోవాలని లఖన్‌బాబు అనే అభ్యర్థి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాడు.