Skip to main content

Telangana: టెట్‌పై మంత్రి సబిత క్లారిటీ ఇదే.. త్వ‌ర‌లోనే వర్సిటీల్లో ప్రొఫెసర్ల పోస్టులు భర్తీ

సాక్షి, హైదరాబాద్‌: ఉపాధ్యాయుల అర్హత పరీక్ష (టెట్‌) నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశించారని, త్వరలో చర్యలు తీసుకుంటామని రాష్ట్ర విద్యా మంత్రి పటోళ్ల సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు.
Sabitha Indra Reddy
Sabitha Indra Reddy

వర్సిటీల్లో ప్రొఫెసర్ల నియామకాలను సైతం త్వరలో చేపట్టనున్నట్టు తెలిపారు. శాసన సభలో మార్చి 12వ తేదీన‌(శనివారం) విద్యాశాఖకు సంబంధించిన పద్దులపై జరిగిన చర్చలో సభ్యులు లేవనెత్తిన అంశాలకు ఆమె సమాధానమిచ్చారు. 

రూ.50 లక్షలిస్తే.. 
ప్రభుత్వ పాఠశాలలకు రూ.2 లక్షలు విరాళమిస్తే స్కూల్‌ నిర్వహణ కమిటీలో సభ్యత్వం, రూ.25 లక్షలిస్తే ప్రాథమిక పాఠశాలలకు, రూ.50 లక్షలిస్తే ప్రాథమికోన్నత పాఠశాలలకు, కోటి ఇస్తే ఉన్నత పాఠశాలలకు దాతల పేర్లు పెట్టాలని నిర్ణయించామన్నారు. త్వరలో దీనికి సంబంధించిన ఉత్తర్వులు ఇస్తామన్నారు. స్కూళ్ల స్థలాలను విద్యా శాఖ పేరు మీదకు మార్పిడి చేయాలని నిర్ణయించి నట్లు తెలిపారు. 

టెట్ మోడ‌ల్‌పేప‌ర్స్ కోసం క్లిక్ చేయండి

ఈ నెల 14 నుంచి..   
ప్రైవేటు, కార్పొరేట్‌ పాఠశాలల ఫీజుల నియంత్రణకు వివిధ రాష్ట్రాల్లో అమలు చేస్తున్న విధానాలపై మంత్రివర్గం ఉప సంఘం అధ్యయనం జరిపిందని, త్వరలో సీఎంకు నివేదిక సమర్పించనుందని సబిత పేర్కొన్నారు. మన ఊరు–మన బడి కార్యక్రమంలో భాగంగా వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ బడుల్లో ఆంగ్ల మాధ్యమంలో విద్యా బోధనను ప్రవేశపెడుతున్నామని, దీనికోసం ఈ నెల 14 నుంచి నిర్వహించనున్న శిక్షణకు ఉపాధ్యాయులందరూ హాజరుకావాలని కోరారు. ఆంగ్ల బోధనలో అనుభవమున్న ఉపాధ్యాయులు సైతం శిక్షణకు హాజరు కావాలని సూచించారు.

TET/DSC 2022: కచ్చితంగా ఉద్యోగం సాధించాలనుకునే వారికి మాత్రమే..

​​​​​​​ప్రభుత్వ పాఠశాలల్లో చేర్చుకోవడానికి టీసీ అవసరం లేదు..
ఏడేళ్లలో కేంద్ర ప్రభుత్వం 7 ఐఐఎంలు, 7 ఐఐటీలు, 2 ఐఐఎస్‌సీఆర్‌లు, 16 ట్రిపుల్‌ ఐటీలు, 4 ఎన్‌ఐటీలు, 157 వైద్య కళాశాలలు, 84 నవోదయ పాఠశాలలను మంజూరు చేస్తే.. రాష్ట్రానికి ఒక్కటి కూడా రాలేదని వెల్లడిం చారు. ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులకు పదోన్నతులు కల్పిస్తున్నట్టు చెప్పారు. మన ఊరు–మన బడి నిధుల వినియోగంలో విద్య కమిటీ చైర్మన్, హెచ్‌ఎంకు జాయింట్‌ చెక్‌ పవర్‌ ఉంటుందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చేర్చుకోవడానికి టీసీ అవసరం లేదని ఆదేశించామని వివరించారు. 

టీచర్‌ కొలువుకు తొలిమెట్టు.. టెట్‌లో అర్హత సాధించే ప్రణాళిక ఇదిగో..!

Published date : 13 Mar 2022 05:15PM

Photo Stories