Skip to main content

TET: టెట్‌ హాల్‌ టికెట్‌పై సన్నీలియోన్‌ ఫొటో

శివమొగ్గ: కర్ణాటకలో నిర్వహించిన ఉపాధ్యాయ అర్హతా పరీక్ష (టెట్‌) హాల్‌ టికెట్‌పై అభ్యర్ధిని ఫోటోకి బదులు సినీ నటి సన్నీ లియోన్‌ చిత్రాన్ని ముద్రించడంతో అందరూ అవాక్కయ్యారు.
TET
టెట్‌ హాల్‌ టికెట్‌పై సన్నీలియోన్‌ ఫొటో

ఈ ఘటనపై శివమొగ్గ నగర సైబర్‌ పోలీసుస్టేషన్‌లో కేసు నమోదైంది. నవంబర్‌ 6న రాష్ట్రమంతటా టెట్‌ పరీక్ష జరిగింది. చిక్కమగళూరుకు చెందిన ఒక విద్యార్థినికి హాల్‌టికెట్‌ రాగా, అందులో ఆమె ఫోటోకు బదులు సన్నీ లియోన్‌ అర్ధ నగ్న చిత్రం ఉంది. దీంతో ఆమె గత్యంతరం లేక శివమొగ్గలోని హెచ్‌ఎస్‌ రుద్రప్ప కాలేజీ పరీక్షా కేంద్రానికి పరీక్ష రాసేందుకు వచ్చింది. సిబ్బంది తనిఖీల్లో సన్నీ లియోన్‌ ఫోటో బయటపడింది.

చదవండి: CTET 2022 : సీటెట్ 2022 సిల‌బ‌స్ ఇదే..|| సీటెట్‌ను ఈజీగా కొట్టే మార్గాలు ఇవే

తాను తన ఫోటోను పంపించానని, ఏం జరిగిందో తెలియదని విద్యారి్థని చెప్పింది. చివరకు విద్యారి్థని ఆధార్‌ తదితర గుర్తింపు కార్డులను పరిశీలించి పరీక్ష రాసేందుకు అనుమతించారు. ఈ ఘటన ఎలా జరిగిందో విచారించాలని పోలీసులకు విద్యా శాఖ అధికారులు ఫిర్యాదు చేశారు. 

చదవండి: CTET-2022 Notification: సీటెట్‌తో ప్రయోజనాలు, పరీక్ష విధానం, విజయానికి మార్గాలు..

Published date : 10 Nov 2022 03:18PM

Photo Stories