155 Jobs: సింగరేణిలో 155 క్లర్క్ పోస్టులు
సంస్థలో ఉన్న 155 క్లర్క్ పోస్టుల (జూనియర్ అసిస్టెంట్ గ్రేడ్–2) భర్తీకి వీరి నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తూ మే 19న నోటిఫికేషన్ జారీ చేసింది. మే 25 నుంచి జూన్ 10 వరకు ఆన్ లైన్ లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఆన్ లైన్ దరఖాస్తులను ప్రింట్ తీసి వీటి హార్డు కాపీలను జూన్ 25లోగా పోస్టు ద్వారా పంపించాల్సి ఉంటుంది. భూగర్భ గనుల ఉద్యోగులు ఏడాదిలో కనీసం 190 మస్టర్లు, భూఉపరితల గనుల ఉద్యోగులు ఏడాదిలో 240 మస్టర్లు పూర్తి చేసి ఉంటే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. డిగ్రీతో పాటు కంప్యూటర్ కోర్సులో 6 నెలల సరి్టఫికెట్ లేదా డిప్లొమా పూర్తి చేసి ఉండాలి. అభ్యర్థులకు ఎలాంటి గరిష్ట వయో పరిమితి లేదు. దరఖాస్తుదారులు తాము పనిచేస్తున్న చోటు నుంచి సంబంధిత అధికారి ద్వారా సమరి్పంచాల్సి ఉంటుంది. సదరు అధికారులు అతని వివరాలతో కూడిన రిపోర్టును జతపరిచి జీఎం (పర్సనల్) రిక్రూట్‌మెంట్ సెల్‌కు పంపిస్తారు. కొత్త రాష్ట్రపతి ఉత్తర్వులను అనుసరించి 95 శాతం పోస్టులను సింగరేణి విస్తరించిన నాటి ఉమ్మడి నాలుగు జిల్లాల ఇన్ సర్వీస్ అభ్యర్థులతో భర్తీ చేయనున్నారు. మిగిలిన 5 శాతం పోస్టులకు తెలంగాణ అన్ని జిల్లాల ఇన్ సర్విస్ అభ్యర్థులు అర్హులు. అర్హులైన అభ్యర్థులకు రాత పరీక్ష కోసం హాల్‌టికెట్లు జారీ చేస్తారు. రాత పరీక్షకు 85 శాతం మార్కులు, అసెస్‌మెంట్ రిపోర్టుకు 15 శాతం మార్కుల వెయిటేజ్ ఉంటుంది. ఈ మొత్తాన్ని కలిపి మెరిట్ జాబితాను ప్రకటిస్తారు. ఎంపికను పారదర్శకంగా నిర్వహిస్తున్నా మని, అభ్యర్థులెవరూ ఎటువంటి ప్రలోభాలకు గురికావొద్దని సంస్థ డైరెక్టర్ ఎన్.బలరామ్ కోరారు. ఎక్స్‌టర్నల్ క్లర్క్ పోస్టుల భర్తీకి త్వరలో మరో నోటిఫికేషన్ జారీ చేస్తామన్నారు.
చదవండి:
TS Police Jobs: పోలీసు ఉద్యోగాలకు దరఖాస్తు చేసే అభ్యర్థులకు.. మరో శుభవార్త..
Job Trends 2022: ఆ రెండు రంగాల్లో.. కొలువుల పండగే!
38926 Jobs In Postal Department: పరీక్ష లేకుండానే కేంద్ర ప్రభుత్వ కొలువు..