Skip to main content

TS Police Jobs: పోలీసు ఉద్యోగాల‌కు ద‌ర‌ఖాస్తు చేసే అభ్య‌ర్థుల‌కు.. మరో శుభ‌వార్త‌..

సాక్షి, హైదరాబాద్‌: నిరుద్యోగులకు వరుస నోటిఫికేషన్లతో శుభవార్తలు చెబుతున్న తెలంగాణ సర్కార్‌ తాజాగా మరో గుడ్‌న్యూస్‌ అందించింది.
TS Police Jobs
TS Police Jobs Age Limit

పోలీసుశాఖ నియామకాల్లో అభ్యర్థుల వయోపరిమితిని మరో రెండేళ్లు పొడగిస్తూ సీఎం కేసీఆర్‌ నిర్ణయం తీసుకున్నారు.

తెలంగాణ పోలీసు ఉద్యోగాల స్డ‌డీ మెటీరియ‌ల్‌, బిట్‌బ్యాంక్‌, మోడ‌ల్‌పేప‌ర్స్‌, ప్రీవియ‌స్ పేప‌ర్స్‌, గైడెన్స్‌, ఆన్‌లైన్ టెస్టులు, స‌క్సెస్ స్టోరీలు మొద‌లైన వాటి కోసం క్లిక్ చేయండి 

తక్షణమే చర్యలు..
తెలంగాణ రాష్ట్రంలో 95 శాతం స్థానికత మొదటిసారిగా అమలులోకి రావడంతో పాటు, రెండేళ్ల  కరోనా కారణంగా, తెలంగాణ యువతీ యువకులకు వయోపరిమితిని పెంచాలని, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి చేసిన విన్నపానికి సీఎం కేసీఆర్ సానుకూలంగా స్పందించారు. ఇందుకు సంబంధించి తక్షణ చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని, డీజీపీ మహేందర్‌ రెడ్డిని కేసీఆర్ ఆదేశించారు.

TS Police Exams: రాతపరీక్షలో నెగిటివ్‌ మార్కులు ఉన్నాయ్‌.. జాగ్రత్తగా రాయండిలా..

దరఖాస్తు గడువు తేదీని కూడా పొడగించే అవకాశాలు..

కాగా పోలీసుశాఖతో పాటు ఫైర్, జైళ్లు, ట్రాన్స్‌పోర్ట్, ఎక్సైజ్, ఎస్పీఎస్‌ ఉద్యోగాలకు తెలంగాణ ప్రభుత్వం నోటిఫికేషన్‌ విడుదల చేసిన విషయం తెలిసిందే. మే 2వ తేదీ నుండి పోలీస్ ఉద్యోగాల కోసం ధరఖాస్తులను స్వీకరిస్తున్నారు. ఒకే అభ్యర్ధి ఎన్ని పోస్టులకైనా ధరఖాస్తు చేసుకోవచ్చు. ఉద్యోగాల దరఖాస్తుకు మే 20 రాత్రి 10 గంటల వరకు మాత్రమే సమయముంది. అయితే వయోపరిమితి పెంచిన నేపథ్యంలో దరఖాస్తు గడువు తేదీని కూడా పొడగించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

TS Police Jobs: ద‌ర‌ఖాస్తు నుంచి తుది రాతపరీక్ష వరకు.. ఏవేవి ఎప్పుడంటే..?

తెలంగాణలో భర్తీ చేయనున్న పోలీసు ఉద్యోగాలు ఇవే..
కానిస్టేబుల్‌ పోస్టుల వివరాలు ఇలా..
➤ కానిస్టేబుల్‌(సివిల్‌): 4965
➤ కానిస్టేబుల్‌(ఏఆర్‌): 4423
➤ కానిస్టేబుల్‌(ఎస్‌ఏఆర్‌సీపీఎల్‌)(పురుషులు): 100
➤ కానిస్టేబుల్‌(టీఎస్‌ఎస్పీ)(పురుషులు): 5010
➤ కానిస్టేబుల్‌ (స్పెషల్‌ ప్రొటెక్షన్‌ ఫోర్స్‌): 390
➤ ఫైర్‌మన్‌ (డిజాస్టర్‌ రెస్పాన్స్‌ అండ్‌ ఫైర్‌ సర్వీసెస్‌): 610
➤ వార్డర్‌(పురుషులు)(జైళ్లు): 136
➤ వార్డర్‌(మహిళలు)(జైళ్లు): 10
➤ కానిస్టేబుల్‌(ఐటీ అండ్‌ కమ్యూనికేషన్స్‌): 262
➤ కానిస్టేబుల్‌(మెకానిక్స్‌)(పురుషులు): 21
➤ కానిస్టేబుల్‌(డ్రైవర్స్‌)(పురుషులు): 100
మొత్తం కానిస్టేబుల్‌ పోస్టులు: 16,027 

TS Police Jobs: పోలీసు ఉద్యోగాలకు దరఖాస్తు చేయాలంటే.. ఈ అర్హతలు తప్పనిసరి

ఎస్సై పోస్టుల వివరాలు ఇవే..

TS SI Posts


☛ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌(సివిల్‌): 414
☛ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌(ఏఆర్‌): 66
☛ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌(ఎస్‌ఏఆర్‌ సీపీఎల్‌)(పురుషులు): 5
☛ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌(టీఎస్‌ఎస్పీ)(పురుషులు): 23
☛ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌(స్పెషల్‌ ప్రొటెక్షన్‌ ఫోర్స్‌)(పురుషులు): 12
☛ స్టేషన్‌ ఫైర్‌ ఆఫీసర్‌(డిజాస్టర్‌ రెస్పాన్స్‌ అండ్‌ ఫైర్‌ సర్వీసెస్‌): 26
☛ డిప్యూటీ జైలర్‌(పురుషులు): 8
☛ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌(ఐటీ అండ్‌ కమ్యూనికేషన్స్‌): 22
☛ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌(పోలీస్‌ ట్రాన్స్‌పోర్ట్‌)(పురుషులు): 3
☛ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌(ఫింగర్‌ ప్రింట్‌ బ్యూరో): 8
మొత్తం ఎస్సై పోస్టులు: 587

​​​​​​​​​​​​​తెలంగాణ ఎస్ఐ,కానిస్టేబుల్ ప‌రీక్ష‌ల బిట్‌బ్యాంక్ కోసం క్లిక్ చేయండి

Published date : 20 May 2022 02:53PM

Photo Stories