Skip to main content

TS Police Jobs: ద‌ర‌ఖాస్తు నుంచి తుది రాతపరీక్ష వరకు.. ఏవేవి ఎప్పుడంటే..?

తెలంగాణ రాష్ట్రంలో మొదటిసారి పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు అన్ని యూనిఫాం విభాగాల ఉద్యోగాలను భర్తీ చేస్తోంది. ఐదు విభాగాలకు సంబంధించి 17 వేల పైచిలుకు పోస్టుల భర్తీకి చేపడుతున్న చర్యలను పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు చైర్మన్‌ వీవీ శ్రీనివాసరావు ‘సాక్షి’కి వివరించారు.
పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు చైర్మన్‌ వీవీ శ్రీనివాసరావు
పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు చైర్మన్‌ వీవీ శ్రీనివాసరావు

అప్లికేషన్ల దాఖలు నుంచి తుది రాతపరీక్ష వరకు అవలంభిస్తున్న వినూత్న పద్ధతులు, పరీక్షల నిర్వహణ తదితర అంశాలను వెల్లడించారు.

TS Police Jobs Events: ఈవెంట్స్ కొట్టాలంటే.. ఇవి పాటించాల్సిందే..!

సాక్షి: ఇప్పటివరకు ఆరు నోటిఫికేషన్లు ఇచ్చారు. అభ్యర్థులకు ఫీజు భారంగా మారిందన్న విమర్శలు వస్తున్నాయి కదా..?
చైర్మన్‌: గతంలోనూ ఇలాగే దరఖాస్తు రుసుము పెట్టాము. ఒకటి కంటే ఎక్కువ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న వారికి రిబేట్‌ రూపంలో కొంత మొత్తాన్ని చెల్లిస్తున్నాము. ఇక్కడ ఒక చిన్న విషయం చెప్పాలి. తుది రాతపరీక్ష పూర్తయ్యే వరకు ఒక్క సబ్‌ఇన్‌స్పెక్టర్‌ అభ్యర్థిపై బోర్డుకు రూ.2,700 ఖర్చవుతోంది. గత నోటిఫికేషన్‌ సమయంలో రూ.2,050 ఖర్చయ్యేది. ఇక, కానిస్టేబుల్‌ అభ్యర్థికి గతంలో రూ.900 ఖర్చయ్యేది.. ఇప్పుడు ధరలు పెరగడంతో రూ.1,200 అవుతోంది.

TS Police Exams Best Preparation Tips: పక్కా వ్యూహంతో.. ఇలా చ‌దివితే పోలీస్ ఉద్యోగం మీదే..!

సాక్షి: దేహదారుడ్య పరీక్షలపై గతంలో పలు ఆరోపణలు, కోర్టు కేసులు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఈసారి అలాంటివి రాకుండా ఏం చర్యలు చేపడుతున్నారు?

Events


చైర్మన్‌: ఆరోపణలు సహజం, కానీ చేపట్టిన చర్యల్లో ఎక్కడా తప్పులు దొర్లలేదు. ప్రిలిమినరీ రాత పరీక్ష తర్వాత నిర్వహించే దేహదారుడ్య పరీక్షల్లో ఖచ్చితమైన ఫలితాలు, పారదర్శకతకు పెద్దపీట వేస్తూ వస్తున్నాం. రన్నింగ్‌ టెస్ట్‌ సమయంలో ఆర్‌ఎఫ్‌ఐడీ (రేడియో ఫ్రిక్వెన్సీ ఐడెంటిఫికేషన్‌) బిబ్స్‌ను వాడుతున్నాం, అంతేకాకుండా ఈసారి రిస్ట్‌ బ్యాండ్‌లను కూడా వాడాలని భావిస్తున్నాం. మరింత పారదర్శకత కోసం సీసీటీవీలను సైతం ఉపయోగించనున్నాం. తప్పిదాలకు తావు లేకుండా సాంకేతికంగా అన్నీ చర్యలు చేపడుతున్నాం.

తెలంగాణ పోలీసు ఉద్యోగాల స్డ‌డీ మెటీరియ‌ల్‌, బిట్‌బ్యాంక్‌, మోడ‌ల్‌పేప‌ర్స్‌, ప్రీవియ‌స్ పేప‌ర్స్‌, గైడెన్స్‌, ఆన్‌లైన్ టెస్టులు, స‌క్సెస్ స్టోరీలు మొద‌లైన వాటి కోసం క్లిక్ చేయండి 

సాక్షి: రాతపరీక్షతో పాటు మిగతా పరీక్షలు ఎప్పుడు, ఏయే పోస్టులకు నిర్వహించనున్నారు?

Exams


చైర్మన్‌: దరఖాస్తు దాఖలుకు మే 20వ తేదీ వరకు అవకాశముంది. అయితే దరఖాస్తుల ప్రక్రియ పూర్తయ్యాక ప్రశ్నపత్రాల రూపకల్పన ఇతర ప్రక్రియకు నెలన్నర పడుతుంది. బహుశా జూలై చివరి వారం లేదా ఆగస్టు రెండో వారంలో ప్రిలిమినరీ నిర్వహించాలని భావిస్తున్నాం. ముందుగా సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఉద్యోగాలకు నిర్వహిస్తాం. తర్వాత రెండు వారాలకు కానిస్టేబుల్, ఇతర ఉద్యోగాలకు ప్రిలిమినరీ నిర్వహించాలని అనుకుంటున్నాం. సెప్టెంబర్‌ చివరి వారం వరకెల్లా ఫలితాలు ప్రకటించేందుకు ప్రయత్నిస్తాం. ప్రిలిమినరీ ఉత్తీర్ణులైన వారి నుంచి డిటైల్డ్‌ అప్లికేషన్‌ సేకరించాలి. దీనికి కనీసం నెలన్నర పట్టొచ్చు. ఈ ప్రక్రియ పూర్తయితే అక్టోబర్‌–నవంబర్‌ మధ్య పీఎంటీ, పీఈటీ(దేహదారుడ్య) పరీక్షలు నిర్వహించాలని ప్రణాళిక రూపొందిస్తున్నాం. తుది రాతపరీక్ష డిసెంబర్‌ రెండో వారం నుంచి నాలుగో వారం మధ్య నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకోవాలి. ఇక సెలెక్షన్‌ లిస్ట్‌కు మూడు వారాల నుంచి నాలుగు వారాలు పడుతుంది. అంటే ప్రక్రియ జనవరి చివరి వారం లేదా ఫిబ్రవరి రెండో వారంలోపు ముగించాలని కార్యచరణ రూపొందిస్తున్నాం.

TS Police Exams: రాతపరీక్షలో నెగిటివ్‌ మార్కులు ఉన్నాయ్‌.. జాగ్రత్తగా రాయండిలా..

సాక్షి: మహిళ అభ్యర్థుల దరఖాస్తులు ఏ మేరకు వస్తున్నాయి?
చైర్మన్‌: గతంకంటే చాలా మెరుగైన రీతిలో దరఖాస్తులు వస్తున్నాయి. ఇప్పటివరకు 25 శాతానికి పైగా మహిళా అభ్యర్థులు దరఖాస్తులు చేసుకున్నారు. ఇది 35 శాతం వరకు వెళ్లే అవకాశం ఉందని భావిస్తున్నాం. పోలీస్‌ శాఖలోకి వచ్చేందుకు మహిళలు ఉత్సాహం చూపిస్తున్నారు. సివిల్‌ ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ విభాగంలో 33 శాతం, ఆర్మ్‌డ్‌ విభాగంలో 10 శాతం కోటా కూడా ఉండటంతో భారీ స్థాయిలో మహిళలు ముందుకువస్తున్నారు.

TS Government Jobs: మరో 677 ప్ర‌భుత్వ ఉద్యోగాల‌కు నోటిఫికేషన్.. పూర్తి వివరాలు ఇవే..

సాక్షి: దేహదారుడ్య పరీక్షల ప్రక్రియలో తెచ్చిన మార్పుల్లో వ్యూహం ఏంటి?

Events


చైర్మన్‌: పురుషుల విభాగంలో 1,600 మీటర్లు నిర్ణీత సమయంలో పరుగెత్తిన వారికి చాతి కొలతలు అవసరంలేదు. పరుగులో అతడి శక్తి తెలిసిపోతుంది. మహిళలకూ ఆ టెస్ట్‌ తొలగించాం. ఎందుకంటే 800 మీటర్లు నిర్ణీత సమయంలో చేరిన వారికి ఆ పరీక్ష అవసరంలేదు. ఇక పురుషులకు, మహిళలకు లాంగ్‌జంప్, షార్ట్‌పుట్‌ ఒకే విధానం ఉంటుంది. ఆర్మ్‌డ్, స్పెషల్‌ పోలీస్, సీపీఎల్, ఎస్‌పీఎఫ్‌ విభాగంలోని వారికి రన్నింగ్‌ టెస్టులోనే మెరిట్‌ మార్కులుంటాయి. షార్ట్‌పుట్, లాంగ్‌ జంప్‌లో ఉండవు. నిర్ణీత దూరం ఉత్తీర్ణత సాధిస్తే చాలు. అలాగే ఆర్మ్‌డ్, స్పెషల్‌ పోలీస్‌ విభాగంలో లైట్‌ మోటార్‌ వెహికల్‌ లైసెన్స్‌ ఉన్న అభ్యర్థులకు మరో మూడు మార్కులు అదనంగా వస్తాయి. డ్రైవర్లుగా కూడా వారి సేవలను వినియోగించుకునేందుకు ఈ మార్కులు ఇస్తున్నాం.

​​​​​​తెలంగాణ ఎస్ఐ,కానిస్టేబుల్ ప‌రీక్ష‌ల బిట్‌బ్యాంక్ కోసం క్లిక్ చేయండి

సాక్షి: రిక్రూట్‌మెంట్‌ తర్వాత మీరు మరో రెండు కీలక బాధ్యతలు పోషించాల్సి ఉంది కదా?
చైర్మన్‌: అవును, పోలీస్‌ ట్రైనింగ్, అకాడమీ డైరెక్టర్‌. ఈ విభాగాలకు బాధ్యుడిని నేనే. అందుకే ఇప్పటికే ట్రైనింగ్‌కు కార్యచరణను రూపొందించే పనిలో ఉన్నా. అకాడమీలో ఒకేసారి 14 వేల మందికి శిక్షణ ఇచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నాం. పోలీస్‌ విభాగ అభ్యర్థులకే మా వద్ద శిక్షణ ఉంటుంది. ఎక్సైజ్, అగ్నిమాపక, జైలు, రవాణా, ఎస్‌పీఎఫ్‌ అభ్యర్థులకు ఆయా విభాగాలు శిక్షణ ఇస్తాయి. 

సాక్షి: ఒకటో తరగతి నుంచి ఏడో తరగతి బోనఫైడ్‌ సర్టిఫికేట్ల విషయంలో ఆందోళన వ్యక్తమవుతోంది. దీనికి పరిష్కారం ఏమిటీ?
చైర్మన్‌: రాష్ట్రపతి నూతన ఉత్తర్వుల ప్రకారం స్థానికత అంశంలో ఒకటి నుంచి ఏడో తరగతి వరకు బోనఫైడ్‌ సర్టిఫికెట్‌ లేదా ఎక్కువ కాలం ఆ సమయంలో ఎక్కడ ఉన్నారో రెసిడెన్షియల్‌ సర్టిఫికెట్‌ దాఖలు చేసినా సరిపోతుంది.

Police Jobs: తెలంగాణ పోలీసు ఉద్యోగాలకు సిలబస్‌ ఇదే.. ఇలా చదివితే..

తెలంగాణలో భర్తీ చేయనున్న పోలీసు ఉద్యోగాలు ఇవే..
కానిస్టేబుల్‌ పోస్టుల వివరాలు ఇలా..
➤ కానిస్టేబుల్‌(సివిల్‌): 4965
➤ కానిస్టేబుల్‌(ఏఆర్‌): 4423
➤ కానిస్టేబుల్‌(ఎస్‌ఏఆర్‌సీపీఎల్‌)(పురుషులు): 100
➤ కానిస్టేబుల్‌(టీఎస్‌ఎస్పీ)(పురుషులు): 5010
➤ కానిస్టేబుల్‌ (స్పెషల్‌ ప్రొటెక్షన్‌ ఫోర్స్‌): 390
➤ ఫైర్‌మన్‌ (డిజాస్టర్‌ రెస్పాన్స్‌ అండ్‌ ఫైర్‌ సర్వీసెస్‌): 610
➤ వార్డర్‌(పురుషులు)(జైళ్లు): 136
➤ వార్డర్‌(మహిళలు)(జైళ్లు): 10
➤ కానిస్టేబుల్‌(ఐటీ అండ్‌ కమ్యూనికేషన్స్‌): 262
➤ కానిస్టేబుల్‌(మెకానిక్స్‌)(పురుషులు): 21
➤ కానిస్టేబుల్‌(డ్రైవర్స్‌)(పురుషులు): 100
మొత్తం కానిస్టేబుల్‌ పోస్టులు: 16,027 

TS Police Jobs: పోలీసు ఉద్యోగాలకు దరఖాస్తు చేయాలంటే.. ఈ అర్హతలు తప్పనిసరి

ఎస్సై పోస్టుల వివరాలు ఇవే..

TS SI Posts


☛ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌(సివిల్‌): 414
☛ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌(ఏఆర్‌): 66
☛ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌(ఎస్‌ఏఆర్‌ సీపీఎల్‌)(పురుషులు): 5
☛ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌(టీఎస్‌ఎస్పీ)(పురుషులు): 23
☛ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌(స్పెషల్‌ ప్రొటెక్షన్‌ ఫోర్స్‌)(పురుషులు): 12
☛ స్టేషన్‌ ఫైర్‌ ఆఫీసర్‌(డిజాస్టర్‌ రెస్పాన్స్‌ అండ్‌ ఫైర్‌ సర్వీసెస్‌): 26
☛ డిప్యూటీ జైలర్‌(పురుషులు): 8
☛ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌(ఐటీ అండ్‌ కమ్యూనికేషన్స్‌): 22
☛ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌(పోలీస్‌ ట్రాన్స్‌పోర్ట్‌)(పురుషులు): 3
☛ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌(ఫింగర్‌ ప్రింట్‌ బ్యూరో): 8
మొత్తం ఎస్సై పోస్టులు: 587

Telangana SI, Constable Jobs: 16,614 పోలీసు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌.. విద్యార్హతలు ఇవే.. ఎంపిక విధానం ఇలా..

మూడేళ్ల వయోపరిమితి సడలింపు 
నిరుద్యోగ యువతకు ఉద్యోగాల కల్పన లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం.. పోలీస్, తదితర విభాగాల్లో పోస్టులకు వయోపరిమితిని మూడేళ్ల పాటు సడలించింది. పోలీస్‌ శాఖ, ఇతర యూనిఫాం విభాగాల్లో.. సబ్‌ఇన్‌స్పెక్టర్‌ (ఎస్సై) పోస్టులకు 21 ఏళ్ల నుంచి 25ఏళ్ల మధ్య వయసు ఉన్నవారే అర్హులు. ఇప్పుడు 28 ఏళ్ల వరకు వయసువారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక కానిస్టేబుల్‌ పోస్టులకు 18 ఏళ్ల నుంచి 22 ఏళ్ల మధ్య వయసు పరిమితి ఉండగా.. ఇప్పుడు 25 ఏళ్ల వయసున్న వారి వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక వివిధ ప్రభుత్వ విభాగాల్లో పనిచేస్తున్న (కార్పొరేషన్లు కాకుండా) వారికి ఐదేళ్లు, ఎక్స్‌సర్వీస్‌మెన్‌కు మరో మూడేళ్లు, ఎన్‌సీసీ ఇన్‌స్ట్రక్చర్లకు మూడేళ్లు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్‌ కేటగిరీల వారికి ఐదేళ్లు, జనగణన శాఖలో తాత్కాలిక పద్ధితిలో ఆరు నెలలల పాటు 1991లో పనిచేసిన వారికి మూడేళ్లు వయోపరిమితి సడలింపు ఉన్నట్టు రిక్రూట్‌మెంట్‌ బోర్డు నోటిఫికేషన్‌లో తెలిపింది. 

ఇవి ఫాలో అయితే.. పోలీసు ఉద్యోగం మీదే || Telangana Police Jobs 2022|| SI, Constable Jobs||Events

​​​​​​​మహిళా రిజర్వేషన్, ఈడబ్ల్యూఎస్‌ కూడా.. 

TS Women Police


రాష్ట్ర పోలీసుశాఖలోని సివిల్, ఆర్మ్‌డ్‌ రిజర్వ్‌ విభాగాల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం గతంలోనే నిర్ణయం తీసుకుంది. గత నియామకాల తరహాలోనే.. ఈసారి కూడా సివిల్‌ విభాగంలో 33శాతం, ఆర్మ్‌డ్‌ రిజర్వ్‌లో 10శాతం మహిళా రిజర్వేషన్‌ వర్తిస్తుందని పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు తెలిపింది. ఇక ఇటీవల కేంద్రం తీసుకొచ్చిన ఎకనామికల్లీ వీకర్‌ సెక్షన్‌ (ఈడబ్ల్యూఎస్‌) కోటా కింద 10శాతం రిజర్వేషన్‌ సైతం అమలవుతుంది.  

  • స్పోర్ట్స్, ఎన్‌సీసీ, పోలీస్‌ ఉద్యోగుల పిల్లలు, జైళ్లశాఖ ఉద్యోగుల పిల్లలు, ఎస్పీఎఫ్‌ ఉద్యోగుల పిలలు, హోంగార్డులకు స్పెషల్‌ కేటగిరీ కింద రిజర్వేషన్‌ ఉన్నట్టు బోర్డు తెలిపింది. 
  • ఎస్సీ, ఎస్టీ కేటగిరీకి సంబంధించి విడాకులు పొందిన మహిళలు, భర్తను కోల్పోయిన మహిళలకు 40 ఏళ్ల వరకు వయో పరిమితి సడలింపు ఉంటుందని ప్రకటించింది.

TS Police Jobs: ఈ నిబంధనల ప్రకారమే పోలీసు ఉద్యోగాలు భర్తీ..​​​​​​​

Published date : 07 May 2022 01:50PM

Photo Stories