Good News for TS Constables : 15,640 కానిస్టేబుల్ అభ్యర్థులకు మరో గుడ్‌న్యూస్..
నెలలోపు కానిస్టేబుల్ నియామకాల ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించింది. దీంతో.. 15,640 కానిస్టేబుల్ పోస్టులకు లైన్ క్లియర్ అయ్యింది. కానిస్టేబుల్ ప్రశ్నపత్రం లో నాలుగు ప్రశ్నలకు మార్కులు కలపాలని గతంలో సింగిల్ బెంచ్ తీర్పు ఇచ్చింది.
దీంతో.. సెలక్ట్ అయిన అభ్యర్థులు సింగిల్ బెంచ్ తీర్పును సవాలు చేశారు. విచారణ జరిపిన డివిజన్ బెంచ్.. గత తీర్పును కొట్టేసింది. సింగిల్ ప్రశ్నల తప్పిదాలపై ఇండిపెండెంట్ ఎక్సపర్ట్ కమిటీ పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని ఆదేశిస్తూనే.. నాలుగు వారాల్లో కానిస్టేబుల్ సెలక్షన్ ప్రాసెస్ పూర్తి చేయాలనీ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డును ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది.
పోలీసు కానిస్టేబుళ్ల రిక్రూట్‌మెంట్ కోసం..
తెలంగాణలో కానిస్టేబుల్ మెయిన్స్ పరీక్ష నుంచి 4 ప్రశ్నలు తొలగించి.. మార్కులను లెక్కించి, మళ్లీ ఫలితాలు వెల్లడించాలని రాష్ట్ర పోలీస్ నియామక బోర్డును హైకోర్టు ఆదేశించిన విషయం తెల్సిందే. 122, 130, 144వ నంబర్ ప్రశ్నలను తెలుగులోకి అనువదించలేదని, 57వ ప్రశ్న తప్పుగా ఉన్నందున వాటిని తొలగించాలని తేల్చిచెప్పింది. 2022, ఆగస్టు 30న జరిగిన కానిస్టేబుల్ నియామక తుది రాత పరీక్షలో 23 ప్రశ్నలకు అభ్యంతరాలు తెలుపుతూ హైకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి.
దీనిపై పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డుకు వినతిపత్రం సమర్పించినా ఎలాంటి బదులివ్వకపోవడంతో కోర్టును ఆశ్రయించినట్లు పిటిషనర్లు తెలిపారు. తప్పుగా రూపొందించిన ప్రశ్నలు, ఇచ్చిన తప్పు సమాధానాలను తొలగించాలని కోరడంతో పాటు తెలుగులోకి అనువదించని కొన్ని ప్రశ్నలను సవాల్ చేశారు. ఈ పిటిషన్లపై న్యాయమూర్తి జస్టిస్ మాధవీదేవి విచారణ చేపట్టారు. పిటిషనర్ల తరఫున న్యాయవాదులు రమేశ్ చిల్ల, ఎన్‌ఎస్ అర్జున్ వాదనలు వినిపించారు. వాదనలు పూర్తి కావడంతో తీర్పు రిజర్వు చేసిన న్యాయమూర్తి.. సోమవారం తీర్పు వెలువరించారు. పోలీసు కానిస్టేబుళ్ల రిక్రూట్‌మెంట్ కోసం నిర్వహించిన మెయిన్స్ పరీక్షలో 4 ప్రశ్నలను మినహాయించి, అభ్యర్థులందరికీ నాలుగు మార్కులు ఇవ్వాలని పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డుని ఆదేశిస్తున్నాం. పేపర్‌లను మూల్యాంకనం చేసి, ఆ తర్వాత ఫలితాలను ప్రచురించి, తదుపరి నియామక ప్రక్రియ కొనసాగించాలి’అని తీర్పులో పేర్కొన్నారు.
☛ టీఎస్‌పీఎస్సీ గ్రూప్–1,2,3&4 : స్టడీ మెటీరియల్ | బిట్ బ్యాంక్ | సక్సెస్ స్టోరీస్ | గైడెన్స్ | సిలబస్ | ప్రివియస్ పేపర్స్ | ఎఫ్‌ఏక్యూస్ | ఆన్‌లైన్ క్లాస్ | ఆన్‌లైన్ టెస్ట్స్ | ఏపీపీఎస్సీ
కానిస్టేబుల్ నియామక పరీక్షల తుది ఫలితాలను పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు ప్రకటించిన విషయం తెలిసిందే. 15,750 మంది పోస్టులకు సంబంధించిన అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. 12,866 మంది పురుషులు, 2,884 మంది మహిళా అభ్యర్థులు ఎంపికయ్యారు. అయితే తాజా తీర్పు మళ్లీ ఫలితాలు వెల్లడించాల్సిన పరిస్థితి నెలకొంది. ఇప్పటికే విడుదలైన ఫలితాల్లో కానిస్టేబుల్‌గా ఎంపికైన అభ్యర్థుల్లో ఇది తీవ్ర గందరగోళానికి దారితీసింది. ఎట్టకేలకు నేడు హైకోర్టు ఇచ్చిన తీర్పుతో.. ఈ గందరగోళానికి తెరపడింది.
Tags
- TS Police Jobs
- TS constable
- ts constable results
- ts constable results 2024
- constable exam results link
- constable exam results update 2024
- ts constable exam results 2024 release date and time
- ts constable results 2024 updates
- ts constable mains results 2024 date
- ts constable mains results 2024 date and time
- ts constable mains results 2024 news
- ts constable results 2024 news telugu
- ts constable final results
- ts constable recruitment 2024
- ConstableAppointment
- LegalDecision
- Telangana
- ConstableRecruitment
- sakshieducation
- Highcourt