Singareni: నిరుద్యోగులకు శుభవార్త.. సింగరేణి సంస్థలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్: సింగరేణి డైరెక్టర్
సెప్టెంబర్ 20న కొత్తగూడెంలోని ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సింగరేణి ఉద్యోగాలకు సంబంధించి ఎలాంటి అక్రమాలు, ఆరోపణలకు తావులేకుండా రాత పరీక్షను పారదర్శకంగా నిర్వహిస్తామని ఆయన స్పష్టం చేశారు. 2020లో సింగరేణి సంస్థ సాధించిన నికర లాభం వివరాలను సెప్టెంబర్ 25న నిర్వహించనున్న బోర్డు సమావేశంలో ప్రకటించే అవకాశముందని బలరాం తెలిపారు. లాభాల్లో కార్మికుల వాటా విషయమై ముఖ్యమంత్రి, సంస్థ సీఎండీ దసరా లోపు నిర్ణయం తీసుకుంటారని వెల్లడించారు. తమ నుంచి బొగ్గు కొనుగోలు చేసిన వారు వారం లోగా బకాయిలను చెల్లించకుంటే ఏడున్నర శాతం వడ్డీ విధిస్తామని, ఈ రూపంలో సంస్థకు ఏటా రూ.100 కోట్లు అదనంగా లభిస్తుందని తెలిపారు.
చదవండి:
Fee Reimbursement: ప్రతిభావంతులైన పిల్లలకు అండ: కె.సూర్యనారాయణ
Singareni: ‘సీఎంపీఎఫ్ కాంట్రిబ్యూషన్స్ 61 ఏళ్ల వరకు ఇవ్వండి’ : ఎన్.శ్రీధర్