Aparna: తొలి ప్రయత్నంలో ఏఈఈగా ఎంపిక
ఆగస్టు 3న విడుదలైన తుది జాబితాలో సత్తాచాటి ఉద్యోగానికి ఎంపికవడంతో కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. హైదరాబాద్ జేఎన్‌టీయూలో సివిల్ ఇంజినీరింగ్ పూర్తిచేసిన అపర్ణ తొలి ప్రయత్నంలో ప్రభుత్వ ఉద్యోగం సాధించడంతో గ్రామస్తులు ఆమెను అభినందించారు.
గిరిజన యువతకు ఉచిత శిక్షణ
ఇచ్చోడ: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని గిరిజన యువకులకు డాక్టర్ రెడ్డి ల్యాబ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వివిధ కోర్సుల్లో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు జేఆర్పీ ముకుంద్ ఓ ప్రకటనలో తెలిపారు. ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా ఆదేశాలతో శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. హైదరాబాద్, కరీంనగర్‌లో మూడు నెలల శిక్షణ ఉంటుందని తెలిపారు.
సోలార్ ప్యానెల్ ఇన్‌స్టాలేషన్ టెక్నీషియన్, ఎలక్ట్రికల్ వెహికల్ మెయింటెనెన్స్ టెక్నీషియన్, పుల్‌స్టాక్ డెవలపర్‌పై శిక్షణ ఇస్తారని తెలిపారు. ఆసక్తి ఉన్న యువకులు తమ సర్టిఫికెట్స్‌తో ఈనెల 5 నుంచి 10 తేదీ సాయంత్రం 5 గంటలలోపు ఉట్నూర్ ఐటీడీఏ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. వివరాలకు 9010295910, 9666748105 నంబర్లలో సంప్రదించాలని కోరారు.
Tags
- AEE
- Adilabad District News
- Gimma Village
- Kyatham Ramesh
- Aparna
- Assistant Executive Engineer
- Civil Engineering
- JNTU
- Telangana News
- Marthe Aparna
- Assistant Executive Engineer
- Civil Engineering
- Ketham Ramesh-Venkatamma
- Government Jobs
- JNTU Hyderabad
- August 3 Selection
- First Attempt Success
- Job announcement
- sakshieducationsuccess stories