Andhra Pradesh: ‘పొదుపు’లో ఏపీ నెంబర్ వన్.. బ్యాంకు రుణాల మంజూరులోనూ..
ఇందులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని స్వయం సహాయక సంఘాలు పొదుపు, క్రెడిట్ లింకేజి విషయంలోనూ దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో నిలిచాయి.
దేశంలోని ఈ సంఘాల పొదుపు ఆంధ్రప్రదేశ్‌లోనే అత్యధికంగా ఉందని నివేదిక స్పష్టం చేసింది. అంతకుముందు నాలుగేళ్లు కూడా ఏపీనే అగ్రగామిగా నిలిచింది. స్వయం సహాయక సంఘాలకు రాష్ట్ర ప్రభుత్వం అందించిన సహాయ సహకారాలు, సున్నా వడ్డీ వంటి ప్రోత్సాహకాలతోనే ఇలా ఉత్తమ పనితీరు కనబరిచినట్లు నివేదిక స్పష్టంచేసింది.
అన్ని రాష్ట్రాల్లో కలిపి పొదుపు సంఘాల సొమ్ము (2023–24 మార్చి నాటికి) రూ.65,089.15 కోట్లు అయితే.. ఇందులో దక్షిణాది రాష్ట్రాల పొదుపు రూ.29,409.06 కోట్లు. ఇందులో ఆంధ్రప్రదేశ్లోని సంఘాల పొదుపు దేశంలోనే అత్యధికంగా రూ.17,292.16 కోట్లుగా ఉందని నివేదక వెల్లడించింది. అంటే దేశంలో మన రాష్ట్ర వాటా 26.56 శాతంగా ఉంది.
World Bank Report: భారత్ ఎదుర్కొంటున్న ఆర్థిక సవాళ్లు.. వరల్డ్ బ్యాంక్ సూచన ఇదే..
సగటు పొదుపు ఏపీలోనే అత్యధికం..
2023–24లో దేశంలోని మహిళా సంఘాల సగటు పొదుపులో కూడా ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉందని నాబార్డు నివేదిక స్పష్టంచేసింది. ఇక్కడ ఒక్కో సంఘం సగటు పొదుపు రూ.1,57,321లుగా ఉంది. బ్యాంకులు కూడా ఏపీ పొదుపు సంఘాలకే అత్యధికంగా రుణాలు మంజూరు చేస్తుండడంతో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉందని తెలిపింది.
రాష్ట్రాల వారీగా చూస్తే..
2023–24లో బ్యాంకుల రుణాల పంపిణీలో రూ.59,777 కోట్లతో ఏపీ మొదటి స్థానంలో ఉండగా కర్ణాటక రూ.25,253 కోట్లతో రెండో స్థానంలో, తెలంగాణ రూ.20,932 కోట్లతో మూడో స్థానంలో.. పశ్చిమ బెంగాల్ రూ.20,671 కోట్లతో నాలుగో స్థానంలో ఉన్నాయని నివేదిక వెల్లడించింది. ఒక్కో పొదుపు సంఘం సగటు రుణ పంపిణీలోకూడా ఏపీ రూ.8.8 లక్షలతో అగ్రస్థానంలో ఉందని, ఆ తరువాత కేరళ రూ.7.7 లక్షలు, తమిళనాడు రూ.6.7 లక్షలతో ఉన్నాయి.
సున్నా వడ్డీతో సంఘాలు బలోపేతం
ఇదిలా ఉంటే.. సకాలంలో రుణాలు చెల్లించే పొదుపు సంఘాలకు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం సున్నావడ్డీ (వడ్డీలేని రుణాలు) రుణాలను అమలుచేసిందని కూడా నివేదిక పేర్కొంది. ఫలితంగా.. పొదుపు సంఘాలు బలోపేతం కావడమే కాక గ్రామీణ కుటీర పరిశ్రమలు పరిపుష్టి సాధించాయని తెలిపింది.
GDP: 'జీడీపీ' అంటే ఏమిటి.. దీన్ని ఎలా లెక్కిస్తారో తెలుసా..?