Singareni: ‘సీఎంపీఎఫ్ కాంట్రిబ్యూషన్స్ 61 ఏళ్ల వరకు ఇవ్వండి’ : ఎన్.శ్రీధర్
Sakshi Education
సింగరేణి ఉద్యోగుల సీఎంపీఎఫ్ కాంట్రిబ్యూషన్స్, పింఛన్ తదితర అంశాలను పరిష్కరించాలన్న సంస్థ చైర్మన్, ఎండీ ఎన్.శ్రీధర్ సూచనల మేరకు డైరెక్టర్ బలరామ్ నేతృత్వంలో అధికారుల బృందం ఢిల్లీకి వెళ్లింది.
‘సీఎంపీఎఫ్ కాంట్రిబ్యూషన్స్ 61 ఏళ్ల వరకు ఇవ్వండి’ : ఎన్.శ్రీధర్
సెప్టెంబర్ 8న ఢిల్లీలోని శాస్త్రి భవన్ లో సీఎంపీఎఫ్ కమిషనర్, కేంద్ర బొగ్గుశాఖ ఆర్థిక సలహాదారు అనిమేశ్ భారతి, కేంద్ర బొగ్గు శాఖ సంయుక్త కార్యదర్శి శ్యామ్‌భగత్ నేగితో ప్రత్యేకంగా సమావేశమైంది. సింగరేణి ఉద్యోగుల పదవీ విరమణ వయసును 61 ఏళ్లకు పెంచుతూ సింగరేణి బోర్డు నిర్ణయం తీసుకుందని వారికి బలరామ్ తెలిపారు. ఈ నేపథ్యంలో సింగరేణి ఉద్యోగుల సీఎంపీఎఫ్ కాంట్రిబ్యూషన్స్ ను 61 ఏళ్ల పదవీ విరమణ వయసు వరకు కొనసాగించేలా ఆదేశాలు జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు.
Upcoming Competitive Exams in March 2025 March 2025 government job exams Upcoming Competitive Exams in March 2025 Competitive exams scheduled for March 2025 List of government exams in March 2025 Exam schedule for UPSC, Bank and Insurance, and more