HM Account Test 2024: హెచ్‌ఎం అకౌంట్ టెస్టుకు దరఖాస్తుల ఆహ్వానం.. చివరి తేదీ ఇదే..
పరీక్షల కమిషనర్ లక్ష్మీకుమారి ఫిబ్రవరి 8న ఒక ప్రకటనలో ఈ విషయం తెలిపారు. డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.బీఎస్‌ఈ.ఏపీ.జీఓవీ.ఇన్ వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తులు పంపాలన్నారు. ఒక పేపర్‌కు రూ.100, రెండు పేపర్లకు రూ.150 చొప్పున సీఎఫ్‌ఎంఎస్ ద్వారా ఈ ఫిబ్రవరి 17వ తేదీలోగా పరీక్ష ఫీజు చెల్లించాలని తెలిపారు. 18 నుంచి 22వ తేదీ వరకూ రూ.60 అపరాధ రుసుంతో చెల్లించవచ్చన్నారు. అపరాధ రుసుం లేని దరఖాస్తులను 18, అపరాధ రుసుం చెల్లించిన దరఖాస్తులు 23 తేదీల్లోగా రాజమహేంద్రవరంలోని జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో అందజేయాలని సూచించారు.
టెక్నికల్ సర్టిఫికెట్ కోర్సుకు..
టెక్నికల్ సర్టిఫికెట్ కోర్సుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు లక్ష్మీకుమారి తెలిపారు. డ్రాయింగ్, టైలరింగ్, ఎంబ్రాయిడరీ, హ్యాండ్లూమ్ అండ్ వీవింగ్ లోయర్, హయ్యర్ కోర్సులకు డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.బీఎస్‌ఈ.ఏపీ.జీఓవీ.ఇన్ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని వివరించారు.
డ్రాయింగ్ లోయర్‌కు రూ.100, హయ్యర్‌కు రూ.150, ఎంబ్రాయిడరీ, హ్యాండ్లూ అండ్ వీవింగ్ లోయర్‌కు రూ.150, హయ్యర్‌కు రూ.200 చొప్పున ఈ నెల 20వ తేదీలోపు ఫీజు చెల్లించాలని సూచించారు. రూ.50 అపరాధ రుసుంతో 29వ తేదీలోపు, రూ.75 అపరాధ రుసుంతో మార్చి 6వ తేదీలోపు ఫీజు చెల్లించవచ్చన్నారు. పూర్తి చేసిన దరఖాస్తులను జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో అందజేయాలని తెలిపారు.
చదవండి: NTPC Recruitment 2024: 223 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలు.. స్క్రీనింగ్ టెస్ట్‌లో రాణించేలా..
వచ్చే నెల 3న పీఏటీ టెస్టు
జిల్లాలో ప్రొఫెషనల్ అడ్వాన్స్‌డ్ టెస్ట్(పీఏటీ)కు దరఖాస్తు చేసిన ఉపాధ్యాయులందరికీ మార్చి 3న పరీక్ష నిర్వహించనున్నారని లక్ష్మీకుమారి తెలిపారు. అభ్యర్థులు డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.బీఎస్‌ఈ.ఏపీ.జీఓవీ.ఇన్ వెబ్‌సైట్ నుంచి హాల్ టికెట్లు తీసుకుని, పరీక్షకు హాజరు కావాలని సూచించారు.
డీఎల్‌ఎడ్ సెమిస్టర్ పరీక్ష ఫీజుకు 11 వరకూ గడువు
జిల్లాలో జరిగే డీఎల్‌ఎడ్ మొదటి సెమిస్టర్ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు ఫిబ్రవరి 11వ తేదీలోగా ఎటువంటి అపరాధం రుసుం లేకుండా ఫీజు చెల్లించవచ్చని లక్ష్మీకుమారి తెలిపారు. రూ.50 ఆలస్య రుసుంతో ఫిబ్రవరి 15 వరకూ చెల్లించవచ్చన్నారు.