Skip to main content

గురుకులం సీట్ల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం

ఒంగోలు: నాగులుప్పలపాడు మండలం అమ్మనబ్రోలు బాలికల గురుకుల పాఠశాలలో 5 నుంచి 8 తరగతుల వరకు ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి అర్హులైన వారి నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు అమ్మనబ్రోలు గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్‌ శైలజ ప్రియదర్శిని ఏప్రిల్ 10న‌ ఒక ప్రకటనలో తెలిపారు.
Invitation of applications for filling up of Gurukulam seats
గురుకులం సీట్ల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం

దరఖాస్తులకు ఏప్రిల్‌ 24వ తేదీవరకు గడువు ఉందన్నారు. అభ్యర్థులు 2021–23 విద్యా సంవత్సరాల్లో 3,4 తరగతులు అభ్యసించిన వారు మాత్రమే 5వ తరగతికి దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. ఉమ్మడి ప్రకాశం జిల్లా పరిధిలో విద్యార్థులు తమ పాఠశాలలో ప్రవేశాలకు అర్హులుగా తెలిపారు. ఓసీ, బీసీ అభ్యర్థులు 2021 సెప్టెంబర్‌ 1వ తేదీ నుంచి 2014 ఆగస్టు 31వ తేదీ మధ్య జన్మించి ఉండాలన్నారు.

చదవండి:

EAMCET 2023: ఎంసెట్‌కు ఇన్ని లక్షల దరఖాస్తులు.. ఈసారి పరీక్ష ఇలా..

TSPSC: ‘అడ్డదారి అభ్యర్థుల’ గుర్తింపే లక్ష్యం

9,231 Jobs: అవరోహణ విధానంలో గురుకుల పోస్టుల భర్తీ

Fake Job Notification: ఉద్యోగాల పేరుతో నకిలీ వెబ్‌సైట్‌

ఎస్సీ, ఎస్టీ బాలికలు 2010 సెప్టెంబర్‌ 1 నుంచి 2014 ఆగస్టు 31వతేదీ మధ్య జన్మించి ఉండాలని పేర్కొన్నారు. 5వ తరగతిలో 80 సీట్లు, 6వ తరగతి బీసీ(ఏ)–1, 7వ తరగతి ఎస్సీ –1, 8వ తరగతిలో బీసీ(బీ)–1 సీట్లు ఖాళీగా ఉన్నట్లు పేర్కొన్నారు. అర్హులైన వారు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని, అభ్యర్థులకు మే 20వ తేదీ ప్రవేశ పరీక్ష ఉంటుందన్నారు.

 

Published date : 11 Apr 2023 05:07PM

Photo Stories