EAMCET 2023: ఎంసెట్‌కు ఇన్ని లక్షల దరఖాస్తులు.. ఈసారి పరీక్ష ఇలా..
ఎలాంటి అపరాధ రుసుము లేకుండా ఫీజు చెల్లించే గడువు ఏప్రిల్ 10తో ముగిసింది. ఈ సంవత్సరం మూడు లక్షలకుపైగా అప్లికేషన్లు వచ్చినట్టు ఎంసెట్ కనీ్వనర్ దీన్‌కుమార్ తెలిపారు. గత ఏడాదితో పోలిస్తే ఈసారి దాదాపు 50 వేలకుపైగా పెరిగినట్టు అధికారులు వెల్లడించారు. నర్సింగ్ కోర్సులో ప్రవేశానికి కూడా ఈసారి ఎంసెట్ తప్పనిసరి చేయడంతో నర్సింగ్ చేయాలనుకునే విద్యార్థులు కూడా ఎంసెట్‌కు దరఖాస్తు చేసుకున్నారు. ఇతర రాష్ట్రాలకు చెందిన విద్యార్థుల సంఖ్య ఈసా రి స్వల్పంగా పెరిగిందని అధికారులు తెలిపారు.
చదవండి: ఎంసెట్ - న్యూస్ | గైడెన్స్ | గెస్ట్ కాలమ్
అగ్రి, మెడికల్ వైపు... :
రాష్ట్రంలో అగ్రికల్చర్, మెడికల్ కోర్సుల్లో చేరేందుకు విద్యార్థులు ఆసక్తి చూపుతున్నారు. కొన్నికాలేజీల్లో అగ్రికల్చర్ బీఎస్సీకి కూడా అనుమతులు వచ్చాయి. కోవిడ్ తర్వా త ఫార్మా కోర్సుకు డిమాండ్ పెరిగిందని, ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉంటున్నట్టు నిపుణులు చెబుతున్నారు. బీఫార్మసీ తర్వాత ఎం ఫార్మసీకి అవకాశాలు పెరుగుతున్నాయి. ఇవన్నీ విద్యార్థులను ఫార్మసీ వైపు ఆకర్షిస్తున్నాయి. 2018లో అగ్రి, మెడికల్ ఎంసెట్ విభాగానికి 73 వేల మంది దరఖాస్తు చేస్తే, ఇప్పుడీ సంఖ్య 1.08 లక్షలకు చేరింది. ఇప్పటివరకూ నర్సింగ్ కోర్సుల్లో ప్రవేశానికి ఇంటర్ మార్కులను కొలమానంగా తీసుకునే వాళ్ళు. ఈ ఏడాది నుంచి ఎంసెట్ మార్కులే కీలకం. ఈ కారణంగా కూడా మెడికల్, అగ్రి దరఖాస్తులు పెరిగినట్టు తెలుస్తోంది. ఇంజనీరింగ్ విభాగానికి గత ఏడాది 1.61 లక్షల దరఖాస్తులొస్తే, ఈసారి 1.95 లక్షలు వచ్చాయి. దాదాపు 34 వేలు పెరిగాయి.
Also Read: EAMCET - QUICK REVIEW | BIT BANK | GUIDANCE | MODEL PAPERS | PREVIOUS PAPERS | PRACTICE QUESTIONS
పటిష్టమైన భద్రతకు చర్యలు
రాష్ట్రంలో వరుసగా ప్రశ్నపత్రాల లీకేజీలు జరుగుతున్న నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రతతో ఎంసెట్ నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. క్షేత్రస్థాయి పరిస్థితులను అధికారులు పరిశీలించారు. పరీక్ష ఆన్‌లైన్‌లోనే జరుగుతుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని సాంకేతికపరమైన భద్రతపై జేఎన్‌టీయూహెచ్‌తో కలిసి మండలి అధికారులు సమీక్షించారు. పాస్‌వర్డ్స్, కీలకమైన కంప్యూటర్ల భద్రత, అవసరమైన రక్షణ వ్యవస్థపై చర్చించారు. ఎంసెట్ మే 10 నుంచి 14 వరకూ జరుగుతుంది. అప్పటివరకూ జాగ్రత్తగా ఉండాలని మండలి, ఎంసెట్ నిర్వహించే జేఎన్‌టీయూహెచ్ నిర్ణయించింది. తరచూ భద్రతపై సమీక్షించాలని భావిస్తున్నారు.
2018 నుంచి ఎంసెట్ దరఖాస్తులు ఇలా..
సంవత్సరం |
ఇంజనీరింగ్ |
అగ్రికల్చర్ |
2018 |
1,47,912 |
73,078 |
2019 |
1,42,218 |
74,981 |
2020 |
1,43,326 |
78,981 |
2021 |
1,64,963 |
86,641 |
2022 |
1,61,552 |
88,156 |
2023 |
1,95,515 |
1,08,457 |
(రెండు విభాగాలకు 333) |
||
(ఈ ఏడాది అపరాధ రుసుం లేకుండా దరఖాస్తు గడువు ముగిసేలోగా వచ్చినవి) |
నాణ్యమైన విద్యకోసం పోటీ..
ఎంసెట్‌కు ఈ ఏడాది అనూహ్యంగా దరఖాస్తులు పెరిగాయి. దీనిని మేం కూడా ఊహించలేదు. హైదరాబాద్ ఎడ్యుకేషన్ హబ్‌గా మారడమే దీనికి కారణం. అగ్రి, మెడికల్ కోర్సులకు డిమాండ్ పెరుగుతోంది. ఈ కారణంగానే దరఖాస్తుల సంఖ్య పెరుగుతోంది.
– ప్రొఫెసర్ ఆర్.లింబాద్రి (ఉన్నత విద్యామండలి చైర్మన్)