Fake Job Notification: ఉద్యోగాల పేరుతో నకిలీ వెబ్‌సైట్
ఏకంగా ఓ వెబ్‌సైట్ రూపొందించి మరీ దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. తెలుగు, సంస్కృత అకాడమీలో ఉద్యోగాల కల్పన పేరిట యువతను మోసగించేందుకు ఓ ముఠా వేసిన ఎత్తుగడ ఇది.
చదవండి: APSRTC: ఉద్యోగాల భర్తీ పేరిట ఫేక్ పోస్టులు
సామాజికమాధ్యమాల్లో ఓ నకిలీ వెబ్‌సైట్ (https://teluguacademy.org.recruitment), ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్ వైరల్ అవుతున్న విషయాన్ని గుర్తించిన అకాడమీ వెంటనే అప్రమత్తౖమెంది. తాము ఉద్యోగాల భర్తీకి ఎలాంటి నోటిఫికేషన్ ఇవ్వలేదని అకాడమీ డైరెక్టర్ వి.రామకృష్ణ ఏప్రిల్ 9న ఓ ప్రకటనలో తెలిపారు. సదరు నకిలీ నోటిఫికేషన్‌ను ఎవరూ విశ్వసించవద్దని కోరారు. ఆ వెబ్‌సైట్‌కు దరఖాస్తు చేయడంగానీ ఫీజుల రూపంలో నగదు చెల్లించడంగానీ చెయ్యొద్దని కూడా ఆయన తెలిపారు.
చదవండి: TSCHE: క్షణాల్లో నకిలీ సర్టిఫికెట్లు పట్టేయొచ్చు!.. వెబ్‌సైట్‌ను ప్రారంభించిన విద్యామంత్రి
తమ అకాడమీకి ఇప్పటివరకు ఎటువంటి వెబ్‌సైట్ లేదని స్పష్టంచేశారు. యువతకు ఏమైనా సందేహాలుంటే రాష్ట్ర తెలుగు, సంస్కృత అకాడమీ ప్రాజెక్టు డైరెక్టర్ పి. ఆంజనేయులు (ఫోన్ నంబర్: 9849616999)ను సంప్రదించాలని సూచించారు. ఇక రాష్ట్ర తెలుగు, సంస్కృత అకాడమీ పేరుతో ఉద్యోగాల భర్తీకి నకిలీ నోటిఫికేషన్ ఇవ్వడంపై రామకృష్ణ విజయవాడ పోలీసులకు ఫిర్యాదు చేశారు.