Skip to main content

APSRTC: ఉద్యోగాల భర్తీ పేరిట ఫేక్ పోస్టులు

సాక్షి, అమరావతి: ఆర్టీసీలో ఉద్యోగాల భర్తీ పేరిట సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోన్న సమాచారం పూర్తిగా అవాస్తవమని ఆర్టీసీ స్పష్టం చేసింది.
APSRTC
ఉద్యోగాల భర్తీ పేరిట ఫేక్ పోస్టులు

త్వరలో ఉద్యోగాలు భర్తీ చేయనున్నారని.. అందుకు కొంత మొత్తం చెల్లించాలని కొందరు చేస్తోన్న మోసపూరిత ప్రచారాన్ని విశ్వసించవద్దని విజ్ఞప్తి చేసింది. గతంలో కూడా ఇదే రీతిలో తప్పుడు సమాచారాన్ని వ్యాప్తిలోకి తెచ్చి యువతను మోసం చేసేందుకు కొందరు ప్రయత్నించారని.. యువత అప్రమత్తంగా ఉండాలని కోరింది.

చదవండి: APSRTC: ఆర్టీసీలో ఇంటర్న్‌షిప్‌కు అవకాశం

ఉద్యోగాలు భర్తీ ప్రక్రియ చేపడితే ఆర్టీసీ అధికారికంగా వెల్లడిస్తుందని... అంతవరకు ఎవరూ సోషల్‌ మీడియాలో వచ్చే సమాచారాన్ని విశ్వసించవద్దని కోరుతూ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఆర్టీసీ ప్రధాన కార్యాలయం ఫిబ్రవరి 21న ప్రకటన వెలువరించింది.

చదవండి: ఆర్టీసీలో.. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా అన్ని ప్రయోజనాలు

Published date : 22 Feb 2023 03:10PM

Photo Stories