APSRTC: ఆర్టీసీలో ఇంటర్న్‌షిప్‌కు అవకాశం
Sakshi Education

డిగ్రీ, ఇంటిగ్రేటెడ్ డిగ్రీ, ఇంజనీరింగ్ విద్యార్థులకు ఇంటర్న్‌షిప్ అందించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రజా రవాణా విభాగం (ఆర్టీసీ) నిర్ణయించింది. స్టైఫండ్ లేకుండా ఇంటర్న్‌షిప్ చేసేందుకు విద్యార్థులను అనుమతించాలని ఆర్టీసీ డిపో మేనేజర్లను సెప్టెంబర్ 14న ఆదేశించింది. రెండో ఏడాది విద్యార్థులకు 2 నెలలు, మూడో ఏడాది విద్యార్థులకు 6 నెలల పాటు ఇంటర్న్‌షిప్ చేసేందుకు అవకాశం కల్పిస్తారు. అనంతరం విద్యార్థులకు ఆర్టీసీ సర్టిఫికెట్లు ప్రదానం చేస్తుంది. ఆసక్తి ఉన్న విద్యార్థులు తమ పరిధిలోని ఆర్టీసీ డిపో మేనేజర్లకు దరఖాస్తు చేసుకోవాలని ఆర్టీసీ వర్గాలు తెలిపాయి.
చదవండి:
Published date : 15 Sep 2022 12:59PM