Harish Kumar Gupta: ఏపీ డీజీపీగా హరీష్‌కుమార్ గుప్తా
![Harish Kumar Gupta Appointed as New DGP of Andhra Pradesh](/sites/default/files/images/2025/01/31/harish-kumar-gupta-1738296397.jpg)
విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డీజీగా ఉన్న ఆయనను పూర్తి అదనపు బాధ్యతలతో డీజీపీగా నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ జనవరి 29వ తేదీ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం డీజీపీగా ఉన్న సీహెచ్ ద్వారకా తిరుమల రావు జనవరి 30వ తేదీ ఉద్యోగ విరమణ చేయనున్నారు.
ఆయన స్థానంలో 1992 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన హరీశ్ కుమార్ గుప్తాను ప్రభుత్వం నియమించింది. కాగా ఈ నెల 31న రిటైర్ కానున్న ద్వారకా తిరుమలరావును ఆర్టీసీ ఎండీగా నియమిస్తూ (రీఎంప్లాయిమెంట్ కల్పిస్తూ) ప్రభుత్వం విడిగా మరో ఉత్తర్వు జారీ చేసింది. ఫిబ్రవరి 1 నుంచి ఏడాది పాటు ఆర్టీసీ ఎండీగా కొనసాగుతారని ప్రభుత్వ ఉత్తర్వుల్లో పేర్కొంది.
TTA President: టీటీఏ అధ్యక్షుడిగా నవీన్ రెడ్డి మల్లిపెద్ది
హరీష్ గుప్తా సార్వత్రిక ఎన్నికల సమయంలో ఎన్నికల సంఘం డీజీపీగా నియమితులయ్యారు. ఆయన కొన్నిరోజుల పాటు ఈ పోస్టులో కొనసాగారు. ఆ తర్వాత కూటమి అధికారంలోకి వచ్చాక ద్వారకా తిరుమలరావును డీజీపీగా నియమించారు.