Jobs: కారుణ్య నియామకాలలో విద్యార్హతకు ప్రాధాన్యం
Sakshi Education
కోవిడ్‌తో మరణించిన ఆర్టీసీ ఉద్యోగుల కుటుంబ సభ్యులకు కారుణ్య నియామకాల్లో విద్యార్హతలకు మొదటి ప్రాధాన్యమివ్వాలని ఆ సంస్థ నిర్ణయించింది.
జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగానికి సంబంధించి అర్హులైన కుటుంబ సభ్యుల విద్యార్హతలను పరిశీలించి ఎక్కువ అర్హత ఉన్నవారికి ఉద్యోగం ఇవ్వాలని నవంబర్ 23న ఉత్తర్వులు జారీ చేసింది. ఇద్దరు గానీ అంతకుమించి కుటుంబ సభ్యులకు విద్యార్హతలు సమానంగా ఉంటే వయసును పరిగణనలోకి తీసుకోవాలని చెప్పింది. ఎక్కువ వయసు ఉన్నవారికి కారుణ్య నియామకం కింద ఉద్యోగం కల్పించాలని స్పష్టం చేసింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ నవంబర్ 23న ఉత్తర్వులు జారీ చేసింది.
చదవండి:
Telangana Government Jobs: ఇది పూర్తయ్యాకే ఉద్యోగ నోటిఫికేషన్లు..ఆయా శాఖల్లోని ఖాళీల వివరాలు ఇలా..
After 10+2: ఇంటర్మీడియెట్ తర్వాత ఫార్మసీ కోర్సులు.. కెరీర్‌కు ధీమా
Published date : 24 Nov 2021 02:59PM