Skip to main content

General Holidays: 2023లో సాధారణ సెలవులు ఇవే..

సాక్షి, హైదరాబాద్‌: 2023లో రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలకు 28 సాధారణ సెలవులు, 24 ఐచ్చిక సెలవులను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.
General Holidays
2023లో సాధారణ సెలవులు ఇవే..

ఈ మేరకు సెలవుల జాబితాతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ నవంబర్‌ 16న ఉత్తర్వులు జారీ చేశారు. అన్ని ఆదివారాలు, రెండో శనివారాల్లో రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలు మూసి ఉంటాయని తెలిపారు. మతం, ఉత్సవంతో సంబంధం లేకుండా 24 ఐచి్ఛక సెలవుల్లో గరిష్టంగా ఏవైనా 5 ఐచి్ఛక సెలవులను వాడుకోవడానికి అనుమతించారు. నెలవంక ఆధారంగా రంజాన్, బక్రీద్, మొహర్రం, మిలాద్‌–ఉన్‌–నబీ పర్వదినాల సెలవుల్లో ఏమైనా మార్పులుంటే తర్వాత ప్రకటిస్తారు. సాధారణ సెలవులు, ఐచి్ఛక సెలవులు ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే వర్తిస్తాయి. పరిశ్రమలు, రాష్ట్ర ప్రభుత్వరంగ సంస్థలు, పబ్లిక్‌ వర్క్స్‌ డిపార్ట్‌మెంట్స్, విద్యాసంస్థల ఉద్యోగులకు సాధారణ సెలవులు వర్తించవు. పండుగలు, ఉత్సవాల సందర్భంగా ఈ సంస్థలు అమలు చేయాల్సిన సెలవుల విషయంలో సంబంధిత ప్రభుత్వ శాఖలు ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేస్తాయని సీఎస్‌ తెలిపారు. సాధారణ సెలవులు 4 ఆదివారాల్లో, 2 రెండో శనివారాల్లో వస్తున్నాయి. దీంతో ప్రభుత్వ ఉద్యోగులకు వాస్తవంగా లభించనున్న సాధారణ సెలవుల సంఖ్య 22కి తగ్గనుంది. కాగా, నెగోషియబుల్‌ ఇన్‌స్ట్రుమెంట్స్‌ యాక్ట్‌ కింద 23 సెలవులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ధారించింది. 

చదవండి: TSPSC Group I: ప్రిలిమ్స్‌లో 5 ప్రశ్నలు రద్దు.. 3 ప్రశ్నలకు మారిన ఆప్షన్లు..

2023లో సాధారణ సెలవులు 

పర్వదినం

   తేదీ

 రోజు

న్యూ ఇయర్‌

01.01.2023

ఆదివారం

బోగి

14.01.2023

రెండో శనివారం

సంక్రాంతి/పొంగల్‌

15.01.2023

ఆదివారం

రిపబ్లిక్‌ డే

26.01.2023

గురువారం

మహా శివరాత్రి

18.02.2023

శనివారం

హోలీ

07.03.2023

మంగళవారం

ఉగాది

22.03.2023

బుధవారం

శ్రీరామ నవమి

30.03.2023

గురువారం

బాబు జగ్జీవన్‌ రామ్‌ జయంతి

05.04.2023

బుధవారం

గుడ్‌ ఫ్రైడే

07.04.2023

శుక్రవారం

బీఆర్‌ అంబేడ్కర్‌ జయంతి

14.04.2023

శుక్రవారం

రంజాన్‌

22.04.2023

శనివారం

రంజాన్‌ మరుసటి రోజు

23.04.2023

ఆదివారం

బక్రీద్‌

29.06.2023

గురువారం

బోనాలు

17.07.2023

సోమవారం

మొహర్రం

29.07.2023

శనివారం

స్వాతంత్య్ర దినోత్సవం

15.08.2023

మంగళవారం

శ్రీకృష్ణాష్టమి

07.09.2023

గురువారం

వినాయక చవితి

18.09.2023

సోమవారం

మిలాద్‌–ఉన్‌–నబీ

28.09.2023

గురువారం

గాంధీ జయంతి

02.01.2023

సోమవారం

బతుకమ్మ ప్రారంభ రోజు

14.10.2023

రెండో శనివారం

విజయదశమి(దసరా)

24.10.2023

మంగళవారం

దసరా మరుసటి రోజు

25.10.2023

బుధవారం

దీపావళి

12.11.2023

ఆదివారం

కార్తీక పూర్ణిమ/గురునానక్‌ జయంతి

27.11.2023

సోమవారం

క్రిస్మస్‌

25.12.2023

సోమవారం

బాక్సింగ్‌ డే

26.12.2023

మంగళవారం

2023లో ఐచ్చిక సెలవులు

కనుమ

16.01.2023

సోమవారం

శ్రీ పంచమి

26.01.2023

గురువారం

హజరత్‌ అలీ జయంతి

05.02.2023

ఆదివారం

షబ్‌ ఈ మీరాజ్‌

19.02.2023

ఆదివారం

షబ్‌ ఈ భరాత్‌

08.03.2023

బుధవారం

మహావీర్‌ జయంతి

04.04.2023

మంగళవారం

షహదత్‌ హజత్‌ అలీ

11.04.2023

మంగళవారం

తమిళ్‌ న్యూ ఇయర్‌ డే

14.04.2023

శుక్రవారం

షబ్‌ ఈ ఖదర్‌

18.04.2023

మంగళవారం

బసవ జయంతి

23.04.2023

ఆదివారం

బుద్ద పూరి్ణమ

05.05.2023

శుక్రవారం

రథ యాత్ర

20.06.2023

మంగళవారం

ఈద్‌ ఈ గదీర్‌

07.07.2023

శుక్రవారం

మొహర్రం

28.07.2023

శుక్రవారం

పార్శీ న్యూ ఇయర్‌ డే

16.08.2023

బుధవారం

వరలక్ష్మీ వ్రతం

25.08.2023

శుక్రవారం

శ్రావణ పూర్ణిమ/ రాఖీ పూరి్ణమ

31.08.2023

గురువారం

అర్బాయిన్‌

06.09.2023

బుధవారం

దుర్గాష్టమి

22.10.2023

ఆదివారం

మహర్నవమి

23.10.2023

సోమవారం

యజ్‌ దౌమ్‌ షరీఫ్‌

27.10.2023

శుక్రవారం

నరక చతుర్దశి

11.11.2023

రెండో శనివారం

సయ్యద్‌ మహ్మద్‌ జువన్‌పురి మది జయంతి

29.11.2023

బుధవారం

క్రిస్మస్‌ ఈవ్‌

24.12.2023

ఆదివారం

Published date : 17 Nov 2022 01:25PM

Photo Stories