CP Kalmeswar: పోటీ పరీక్షల్లో రాణించడం అభినందనీయం
Sakshi Education
ఖలీల్‌వాడి: పోలీసుల పిల్లలు ఉద్యోగ పోటీ పరీక్షలు, నీట్‌లో రాణించడం అభినందనీయమని సీపీ కల్మేశ్వర్ అన్నారు.
నీట్ ర్యాంకులు, ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన పోలీసు సిబ్బంది పిల్లలను కమిషనరేట్ కార్యాలయంలో సీపీ ఆగస్టు 20న సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 24 గంటలపాటు విధినిర్వహణలో నిమగ్నమై ఉండే పోలీసు సిబ్బందికి తమ కుటుంబంతో గడిపే సమయం ఉండదన్నారు.
చదవండి: Jaya Sucess Story: వ్యవసాయ కుటుంబం.. మూడు ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికైన జయ
ఆ లోటును అధిగమిస్తూ పిల్లలు చదువుల్లో రాణించడం, ప్రభుత్వ ఉద్యోగాలు సాధించడం అభినందనీయమన్నారు.
నీట్‌లో ర్యాంకు సాధించిన ఐదో టౌన్ పోలీస్టేషన్ కానిస్టేబుల్ మోహన్ కుమార్తె ఎ లాస్య, మూడో టౌన్ కానిస్టేబుల్ రఘవర్ధన్ కుమారుడు ఎస్ స్నేహల్, సీసీఎస్ కానిస్టేబుల్ కుమార్తె జె మౌనతోపాటు ఐదు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన ఎన్‌ఐబీ హెడ్‌కానిస్టేబుల్‌గా మోజీరాం కుమార్తె ఆర్ కావేరిని సీపీ సన్మానించారు.
Published date : 21 Aug 2024 04:13PM