Transfer of Employees: ‘GHMC’ని ఒకే స్టేషన్‌గా పరిగణిస్తాం.. ఇలా చేసై తీవ్ర నష్టమంటున్న ఉద్యోగులు
హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలను ఒకే స్టేషన్‌గా పరిగణిస్తుండటంతో ఉద్యోగులు తీవ్రంగా నష్టపోతున్నారని తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవించింది. దీనిపై స్పందించిన రాష్ట్ర ఆర్థిక శాఖ ఉద్యోగుల స్టేషన్ సీనియార్టీలో భాగంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధినంతా ఒక స్టేషన్‌గా పరిగణిస్తామని తెలిపింది.
చదవండి: IAS Officers Transfers: తెలంగాణలో భారీగా ఐఏఎస్‌ల బదిలీలు.. ఆమ్రపాలికి జీహెచ్‌ఎంసీ బాధ్యతలు
రంగారెడ్డి జిల్లా, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కార్యాలయాలు ఆయా జిల్లాల పరిధిలో ఏర్పాటు కావడంతో అంతకు ముందు గ్రేటర్‌లో ఉన్న కాలాన్ని జీహెచ్‌ఎంసీ స్టేషన్‌లో పనిచేసినట్లుగానే పరిగణించాల్సి ఉంటుందని స్పష్టంచేసింది. ఈమేరకు ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు జూలై 12న మెమో జారీ చేశారు.
చదవండి: Inspiring Story : హ్యాట్స్ ఆఫ్ జయలక్ష్మి.. చెత్త బండి లాగుతూ.. చదువుతూ.. ఐఏఎస్..