Skip to main content

Guest Faculty Jobs: గెస్ట్‌ లెక్చరర్ల భర్తీకి ఇంటర్వ్యూ

మహబూబ్‌నగర్‌ ఎడ్యుకేషన్‌: జిల్లాకేంద్రంలోని డైట్‌ కళాశాలలో వివిధ సబ్జెక్టుల కోసం ఖాళీగా ఉన్న పోస్టులను గెస్టు లెక్చరర్స్‌ ద్వారా భర్తీకి న‌వంబ‌ర్‌ 12న ఇంటర్వ్యూలు నిర్వహించారు.
Interview for the post of Guest Faculty Jobs  Interviews for guest lecturer posts in Mahbubnagar Diet College  Vacant teaching positions in Mahbubnagar District College Interview process for guest lecturers in Mahbubnagar Education

మొత్తం 16 మందికిపైగా అభ్యర్థులు హాజరవ్వగా.. ఈ ప్రక్రియను ఆర్జేడీ విజయలక్ష్మి పరిశీలించారు. అయితే పలువురు అభ్యర్థులు అసలు నోటిఫికేషన్‌ ఇవ్వలేదని.. అభ్యర్థులకు ఎవరికీ సమాచారం లేకుండా భర్తీ ప్రక్రియ చేపడుతున్నారని ఆరోపించారు. అలాగే రిటైర్డ్‌ అయిన వారికి అవకాశం ఇవ్వొద్దని కోరారు.

చదవండి: Guest Teachers : ‘డే స్టడీ– నైట్‌ స్టే’ అంటూ గెస్ట్ టీచ‌ర్ల‌ అపరిమిత విధులు!

ఈ విషయంపై గతంలో పలువురు డైట్‌ కళాశాల ఎదుట నిరసన చేపట్టారు. ఈ క్రమంలో న‌వంబ‌ర్‌ 12న జరిగిన ఇంటర్వ్యూల్లో వారికి కూడా అవకాశం కల్పించడం వివాదాస్పదంగా మారింది.

Join our WhatsApp Channel: Click Here
Join our Telegram Channel: Click Here
Follow our YouTube Channel: Click Here
Follow our Instagram Page: Click Here

గెస్ట్‌ లెక్చరర్ల భర్తీని పారదర్శకంగా చేపట్టకపోవడంపై ఆందోళన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో నాగర్‌కర్నూల్‌ డీఈఓ గోవిందరాజులు, అడిషనల్‌ డైరెక్టర్‌ అనసూయ తదితరులు పాల్గొన్నారు.

Published date : 14 Nov 2024 09:18AM

Photo Stories