Vijaya Mohan: ‘గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు’లో ఏపీ గ్రామ సచివాలయ ఉద్యోగి
Sakshi Education
పెన్సిల్ లెడ్‌పై అతుకులు లేకుండా, ఎలాంటి సూక్ష్మ పరికరాలు వినియోగించకుండా సూదిమొనతో 246 లింకులు చెక్కినందుకు గాను ఏపీ గ్రామ సచివాలయ ఉద్యోగి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులోకి ఎక్కాడు.
పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండలం లిఖితపూడి గ్రామ సచివాలయంలో అసిస్టెంట్ సర్వేయర్‌గా పనిచేస్తున్న కొప్పినీడి విజయమోహన్ కు సూక్ష్మ కళాకారుడిగా పేరు ఉంది. సూదిమొనతో బియ్యపు గింజలపై కళాకృతులు చెక్కి ఇప్పటికే లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌తో పాటు పలు జాతీయ అవార్డులు సొంతం చేసుకున్నాడు. రాష్ట్రీయ యువగౌరవ్ సమ్మాన్ అవార్డును మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా అందుకున్నాడు.
చదవండి:
Shivali Srivastava: కాగితపు బొమ్మల తయారీలో శివాలికి 13 గిన్నిస్ రికార్డులు
Published date : 25 Nov 2021 03:59PM