Skip to main content

Dhorra Mafi village: ఊరు ఊరంతా ఉద్యోగ‌స్తులే.. ఆసియాలో ఆ గ్రామం నంబ‌ర్ 1... ఎక్క‌డ ఉందంటే

బ‌తుకుదెరువు కోసం ప‌ట్ట‌ణాల‌కు వ‌ల‌స‌లు పెరిగిపోతున్నాయి. పెరిగిపోతున్న ప‌ట్ట‌ణీక‌ర‌ణ కార‌ణంగా దేశానికి ప‌ట్టుకొమ్మ‌లైన ప‌ల్లెలు బోసిపోతున్నాయి. ప‌ల్లెల్లో ఉన్న కాస్తో, కూస్తో జ‌నాభా ఏవో చిన్నాచిత‌కా ప‌నులు చేసుకుంటూ ఉన్న ఊరిని వదిలేసి వెళ్ల‌లేక బ‌తుకీడుస్తున్న రోజులివి.
Dhorra Mafi village
ఊరు ఊరంతా ఉద్యోగ‌స్తులే.. ఆసియాలో ఆ గ్రామం నంబ‌ర్ 1... ఎక్క‌డ ఉందంటే

అలాంటిది ఓ ప‌ల్లెలో ప్ర‌తీ ఇంటికి ఒక ఉద్యోగి ఉన్నాడు. ఆ గ్రామంలో 75 శాతం మంది అక్ష‌రాస్యులే. 80 శాతం మంది ఉద్యోగాలు చేస్తున్న‌వారే. ఈ గ్రామం ఎక్క‌డుందో తెలుసా..!

బీమారు రాష్ట్ర‌మైన ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్ జిల్లాలో ధోర్రా మాఫీ గ్రామంలో ఎక్క‌డ‌చూసినా విద్యావంతులే క‌నిపిస్తారు. ఈ ప్ర‌త్యేక‌త‌తో ఈ గ్రామం ఆసియాలోనే గుర్తింపు తెచ్చుకుంది. ఇది లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో కూడా చోటు ద‌క్కించుకుంది.  

Finance Ministry: పేద ప్ర‌జ‌ల‌కు నేరుగా రూ.33 వేల ఆర్థిక సాయం... కేంద్రం ఏం చెబుతోందంటే...

2002లో ధోర్రా మాఫీ అనే ఈ గ్రామం పేరు 'లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్స‌లో కి ఎక్కింద‌ని స్థానికుల్లో ఒక‌రైన‌ తయ్యబ్ ఖాన్ మీడియాకు చెప్పాడు. ఇక్కడ అక్షరాస్యత రేటు 75 శాతానికి పైగా నమోదైంది. ఈ గ్రామం పేరు కూడా గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ కోసం ఎంపిక చేశార‌ని స్థానికులు చెబుతున్నారు.

Dhorra Mafi village

ఉత్త‌ర‌ప్ర‌దేశ్ అన‌గానే ఇదివ‌ర‌కు గుండారాజ్ ప్ర‌భుత్వ‌మే క‌నిపించేంది. ఇక ఆ రాష్ట్రంలో మౌలిక‌స‌దుపాయాలు ఎలా ఉంటాయో చెప్ప‌న‌వ‌స‌రం లేదు. ప‌ట్ట‌ణాల్లోనే స‌రైన వ‌స‌తులు ఉండ‌వు. అలాంటిది ఈ గ్రామంలో ప్ర‌తిఒక్క‌రికి పక్కా గృహాలు, 24 గంటల కరెంటు, నీరు పుష్క‌లంగా ఉన్నాయి. విద్యార్థులు చ‌దువుకునేందుకు అనేక ఇంగ్లీషు మీడియం స్కూళ్లు, కళాశాలలు ఉన్నాయి.

74-Year Career: 74 ఏళ్లపాటు ఏ ఒక్క‌రోజు సెల‌వు తీసుకోలేదు.. ఈమె గురించి మీకు తెలుసా...

ఈ గ్రామ ప్రజలు వ్యవసాయం చేసుకుంటూనే ఉద్యోగాలు చేస్తారు. అక్షరాస్యత విషయంలో ఇక్కడి స్త్రీలు పురుషులతో సమానంగా ఉన్నారు. ఈ గ్రామానికి చెందిన డాక్టర్ సిరాజ్ ఐఏఎస్ అధికారి. ఫైజ్ ముస్తఫా అనే వ్యక్తి ఒక విశ్వవిద్యాలయంలో వైస్ చాన్సలర్‌గా ఉన్నారు. ఈ గ్రామ ప్రజలు చాలా మంది విదేశాల్లో కూడా సెటిల‌య్యారు.  

Dhorra-Mafi-village

Success Story: అమెరికాలో అద‌ర‌గొడుతున్న భార‌తీయ మ‌హిళ‌... వంద‌ల కోట్ల వ్యాపారంతో ప‌దిమందికి స్ఫూర్తిగా నిలుస్తోన్న జోయా

మాఫీ గ్రామంలో సుమారుగా 11 వేల మంది జనాభా ఉంది. గ్రామంలో 90 శాతానికి పైగా ప్రజలు అక్షరాస్యత కలిగి ఉన్నారు. ఈ గ్రామంలోని 80 శాతం మంది ప్రజలు దేశవ్యాప్తంగా అనేక న‌గ‌రాల్లో ప్ర‌భుత్వ ఉద్యోగాల్లో స్థిర‌ప‌డ్డారు. డాక్టర్లు, ఇంజనీర్లు, సైంటిస్టులు, ప్రొఫెసర్లు, ఐఏఎస్‌లు కూడా ఉన్నారు. ధోర్రా మాఫీ గ్రామం అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీకి స‌మీపంలో ఉంటుంది. ఇక్కడి ప్రొఫెసర్లు, డాక్టర్లు తమ ఇళ్లను గ్రామంలోనే నిర్మించుకోవ‌డం మ‌రో విశేషం. 

Published date : 10 Jul 2023 01:50PM

Photo Stories