Finance Ministry: పేద ప్రజలకు నేరుగా రూ.33 వేల ఆర్థిక సాయం... కేంద్రం ఏం చెబుతోందంటే...
గత కొద్ది రోజులుగా సోషల్‌మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది ఈ వార్త. ఆర్థిక మంత్రిత్వశాఖ పేదవారికి ఒక్కోక్కరికి రూ. 32,849 అందజేస్తోందని ఆ వార్త ఉద్దేశం. వాట్సప్, ఫేస్‌బుక్ లో క్షణాల్లో వైరల్‌గా మారింది ఈ మెసేజ్.
ఈ వైరల్ మెసేజ్‌పై ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో(పీఐబీ) స్పందించింది. అసలు ఇలాంటి పథకాన్ని ప్రభుత్వం తీసుకురాలేదని, ఈ వార్త పూర్తిగా అసత్యమని స్పష్టం చేసింది.
Job Security: తీవ్ర ఆందోళనలో భారతీయ ఉద్యోగులు... ఉద్యోగంపై బెంగ... ఎందుకంటే
కొందరు కేటుగాళ్లు ఈజీ మనీ కోసం విపరీతంగా ఫేక్ మెసెజ్‌లను వ్యాప్తిలోకి తీసుకురావడం ఈ మధ్య కాలంలో ఎక్కువైంది. డబ్బులనగానే ఆశతో లింక్‌ను ఓపెన్ చేయడం వల్ల వ్యక్తిగత సమాచారాన్ని తస్కరించి, తద్వారా బ్యాంకులో ఉన్న డబ్బులను కాజేయడం రివాజుగా మారింది.
ప్రస్తుతం సర్య్కులేట్ అవుతున్న మెసేజ్‌ను ఏ మాత్రం ఫేక్‌గా గుర్తించనంతగా సైబర్ మోసగాళ్లు క్రియేట్ చేశారు. కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ లెటర్‌హెడ్‌పైనే ఈ పథకాన్ని ప్రచురించి ప్రచారంలోకి తీసుకురావడంతో చాలామంది ఇది నిజమని నమ్ముతున్నారు. ఈ పరిణామాలను గమనించి పీఐబీ ఫ్యాక్ట్ చెక్ ఇది తప్పుడు వార్త అని నిర్ధారించింది.
74-Year Career: 74 ఏళ్లపాటు ఏ ఒక్కరోజు సెలవు తీసుకోలేదు.. ఈమె గురించి మీకు తెలుసా...
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పుడేగాని ఇలాంటి పథకాలను ప్రకటించవు. ఒకవేళ ఏవైనా పథకాలు ప్రకటిస్తే అవి కచ్చితంగా ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో టెలికాస్ట్ అవుతాయి. కాబట్టి ఇలాంటి ఫేక్ మెసెజ్‌ల పట్ల తస్మాత్ జాగ్రత్త. ఎవరికీ డబ్బులు ఊరికే రావు...!
అలాగే ఈ ఏడాది ఏప్రిల్లో రూ.239 విలువైన ఫోన్ రీఛార్జ్‌ను కేంద్రం వినియోగదారులకు ఉచితంగా ఇస్తోందంటూ ఓ ఫేక్ వాట్సాప్ మెసేజ్ వైరల్‌గా మారింది. లింక్ పై క్లిక్ చేసిన వారి ఖాతాలు ఖాళీ అయిన విషయం తెలసిందే.