Job Security: తీవ్ర ఆందోళనలో భారతీయ ఉద్యోగులు... ఉద్యోగంపై బెంగ... ఎందుకంటే
ఏడీపీ రిసెర్చ్ ఇనిస్టిట్యూట్ ‘పీపుల్ ఎట్ వర్క్ 2023: ఏ గ్లోబల్ వర్క్‌ఫోర్స్ వ్యూ’ పేరిట సర్వే నిర్వహించింది. ఆ సర్వేలో 47 శాతం మంది సిబ్బంది తమ కొలువుల భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏడీపీ రిసెర్చ్ ఇనిస్టిట్యూట్ 32,000 మందిపై సర్వే నిర్వహించింది.ఈ సర్వేలో సగానికి పైగా జెన్ జెడ్ (18- 24ఏళ్ల వయస్సు) వారు చేస్తున్న ఉద్యోగం పట్ల నమ్మకంతో లేదనే తెలుస్తోంది. 55ఏళ్ల వయస్సు వారిలో సైతం ఈ తరహా ఆందోళనలు రెట్టింపు స్థాయిలో ఉన్నట్లు నివేదిక హైలెట్ చేసింది.
74-Year Career: 74 ఏళ్లపాటు ఏ ఒక్కరోజు సెలవు తీసుకోలేదు.. ఈమె గురించి మీకు తెలుసా...
ముఖ్యంగా, ఈ తరహా ఆందోళనలు రియల్ ఎస్టేట్, కన్‌స్ట్రక్షన్ విభాగాల్లో పనిచేస్తున్న సిబ్బంది ఎక్కువ మంది ఉన్నారు. అంతర్జాతీయ జాబ్ మార్కెట్‌లో మీడియా, ఇన్ఫర్మేషన్ ఇండస్ట్రీ ఉద్యోగాలపై అపనమ్మకంతో ఉన్నారు. ఆయా రంగాలతో పాటు ఆతిధ్యం, ఎంటర్‌టైన్మెంట్ వంటి రంగాల్లో పనిచేస్తున్న తమ జాబ్ ఉంటుందో..ఊడుతుందోనన్న అనుమానాల్ని వ్యక్తం చేస్తున్నారు.
కారణాలు అనేకం
మొత్తం వర్క్ ఫోర్స్‌లో యువతే అభద్రతకు లోనవుతున్నారు. అందుకు అనేక కారణాలు ఉన్నాయని ఏడీపీ ఎండీ రాహుల్ తెలిపారు. ఇటీవల కాలంలో ఆర్ధిక అనిశ్చితి, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన గూగుల్, ట్విటర్, మెటాలాంటి సంస్థల్లో ఉద్యోగుల తొలగింపు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత టూల్స్ మనుషులు చేస్తున్న ఉద్యోగాలకు మరింత ప్రమాదంలోకి నెట్టే ప్రమాదం ఉందని వెలుగులోకి వస్తున్న నివేదికలే యువతలో ఆందోళనకు కారణమని తెలిపారు.
Success Story: అమెరికాలో అదరగొడుతున్న భారతీయ మహిళ... వందల కోట్ల వ్యాపారంతో పదిమందికి స్ఫూర్తిగా నిలుస్తోన్న జోయా
జాబ్ మార్కెట్‌లో నైఫుణ్యం ఉన్న వారిని గుర్తించడంలో, వారిని ఉద్యోగంలో కొనసాగించడం మరింత కష్టంగా మారినట్లు రాహుల్ గోయల్ గుర్తించామని అన్నారు. సంస్థలు తమ ఉద్యోగులకు భరోసా ఇవ్వకపోతే అనుభవాల్ని, ఉత్సాహాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది. తద్వారా క్లయింట్లకు ఆశించిన స్థాయిలో సేవల్ని అందించడంలో కష్టతరం మారుతుందని చెప్పారు.
దిగ్రేట్ రిజిగ్నేషన్ వంటి
ప్రపంచవ్యాప్తంగా, గత ఏడాది కాలంలో ఐదుగురు జెన్‌జెడ్‌లలో ఒకరు.. చేస్తున్న రంగం నుంచి మరో రంగంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నాలు చేశారు. పావు వంతు మంది సొంతంగా బిజినెస్ ప్రారంభించాలని ఆలోచించినట్లు తేటతెల్లమైంది. 55 ఏళ్లు పైబడిన వారిలో 17 శాతం మంది ముందస్తుగా పదవీ విరమణ చేయాలని ఆలోచించారు. ఇదే ది గ్రేట్ రిజిగ్నేషన్ వంటి అంశాలకు కారణమందన్నారు.
Success Story: ఏడేళ్ల నిరీక్షణ.. వరుసగా నాలుగు సార్లు ఫెయిల్... చివరికి ఐఎఫ్ఎస్ సాధించానిలా...
ఉద్యోగంలో అభద్రత పోవాలంటే
యజమానులు ఉద్యోగులు మార్కెట్‌కు అనుగుణంగా జీతాలు ఇవ్వగలిగితే ఈ ఆందోళన నుంచి బయట పడొచ్చు. తద్వారా ఉద్యోగులు తాము పనిచేసే సంస్థ పట్ల మరింత సానుకూలంగా భావించే అవకాశం ఉంది.