Guinness Book: గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’లో పాలకొండ విద్యార్థి వ్యాసం
Sakshi Education
పాలకొండ రూరల్: పాలకొండకు చెందిన మెడికల్ విద్యార్థి వ్యాసం గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించింది. వివరాలిలా ఉన్నాయి. పాలకొండకు చెందిన ఊన్న తేజేశ్వరరావు పీహెచ్‌డీలో భాగంగా హెల్త్ విభాగానికి సంబంధించి పరిశోధించి సమర్పించిన డ్రగ్ డిజైనింగ్ వ్యాసం గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో ప్రచురితమైంది. ఈ సందర్భంగా తేజేశ్వరరావు రాసిన డ్రగ్ డిజైనింగ్ బుక్ ఆదివారం చైన్నెలో ప్రచురించారు. 2020లో పీహెచ్‌డీ చేసిన ఊన్న తేజేశ్వరరావు తల్లిదండ్రులు ఊన్న నరసింహరావు, గౌరి పాలకొండలోని నక్కలపేట బాబా టెంపుల్‌కు వెళ్లే దారిలో చిన్నదుకాణం నడుపుతూ జీవిస్తున్నారు.పేదరికంలో పుట్టిన తమ కుమారుడు గిన్నిస్‌బుక్‌లో పేరు సాధించడం తల్లిదండ్రులు ఆనందంతో తబ్బిఉబ్బిబ్బయ్యారు.
Published date : 28 Aug 2023 03:17PM