Skip to main content

Maha Vir Chakra 2021: కల్నల్‌ సంతోష్‌బాబుకు మహావీర్‌ చక్ర

దేశ రక్షణలో భాగంగా గతేడాది గల్వాన్‌ లోయలో చైనా సైనికులతో పోరాడి వీరమరణం పొందిన కల్నల్‌ సంతోష్‌బాబును కేంద్రం మహావీర్‌చక్ర పురస్కారంతో గౌరవించింది.
ఈ అవార్డును తల్లి మంజుల, భార్య సంతోషి  రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ చేతుల మీదుగా అందుకున్నారు
ఈ అవార్డును తల్లి మంజుల, భార్య సంతోషి రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ చేతుల మీదుగా అందుకున్నారు

మరణానంతరం సంతోష్‌బాబుకు ప్రకటించిన ఈ అవార్డును తల్లి మంజుల, భార్య సంతోషి నవంబర్‌ 23వ తేదీన రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ చేతుల మీదుగా అందుకున్నారు. గతేడాది జూన్‌లో గల్వాన్‌లోయలో భారత్, చైనా మధ్య ఉద్రిక్తతలు చోటుచేసుకోగా 16 బిహార్‌ రెజిమెంట్‌ కమాండింగ్‌ అధికారి సంతోష్‌బాబు నేతృత్వంలో భారత సేనలు చైనాను ధీటుగా ఎదుర్కొన్నాయి. ఈ ఘర్షణలో సంతోష్‌బాబు సహా 21 మంది సైనికులు వీర మరణం పొందిన విషయం విదితమే. ఈ ఘటనలో వీర మరణం పొందిన నాయబ్‌ సుబేదార్‌ నుదురామ్‌ సోరెన్, హవల్దార్‌ (గన్నర్‌) కె.పళని, నాయక్‌ దీపక్‌ సింగ్, సిపాయి గుర్తేజ్‌ సింగ్‌ను వీర చక్ర అవార్డుతో కేంద్రం గౌరవించింది. వారి కుటుంబీకులు ఆ పురస్కారాన్ని అందుకున్నారు. తన భర్తకు మహావీరచక్ర పురస్కారం లభించడం గర్వంగా ఉందని కల్నల్‌ సంతోష్‌బాబు భార్య సంతోషి తెలిపారు.

Published date : 25 Nov 2021 02:38PM

Photo Stories