Guinness Book: గిన్నిస్‌బుక్ రికార్డులో అధ్యాపకురాలి వ్యాసం
Sakshi Education
గణపవరం: గణపవరం ప్రభుత్వ జూనియర్ కాలేజీలో భౌతిక శాస్త్ర అధ్యాపకురాలిగా పనిచేస్తున్న సీహెచ్ సురేఖ షారోన్ అరుదైన ప్రయత్నంలో తన వంతు సాయం అందించారు. అతి పెద్ద పుస్తకంగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డుకు ఎక్కిన పుస్తకంలో ఆమె వ్యాసం ప్రచురితమైంది. ఈస్‌ఎన్ పబ్లికేషన్స్ చైన్నె వారు ప్రచురించిన అడ్వాన్స్‌మెంట్ ఇన్ ఫిజిక్స్ బుక్ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులోకి ఎక్కింది. అందులో ఆమె రాసిన ఇండక్షన్ టు గ్రీన్ కెమిస్ట్రీ అంశంపై ఆర్టికల్ ప్రచురితమైంది. ఆమెకు ఈస్‌ఎన్ పబ్లికేషన్స్ సర్టిఫికెట్‌తో పాటు, ప్రశంసా పత్రం, మెడల్ అందచేశారు. కళాశాల ప్రిన్సిపల్ రామచంద్రరాజు, కళాశాల సిబ్బంది ఆమెను అభినందించారు.
చదవండి: Faculty Posts: ఫుడ్ టెక్నాలజీ కోర్సుకు అధ్యాపకుల నియామకం
Published date : 14 Oct 2023 01:43PM