Skip to main content

School Holidays Reduced: విద్యార్థులకు శీతాకాలపు సెలవులు తగ్గింపు

దేశ రాజధాని ఢిల్లీలోని పాఠశాలలకు శీతాకాలపు సెలవులకు సంబంధించిన కీలక ప్రకటన వెలువడింది.
Winter Holidays Declared for Schools in Delhi  Winter vacation in Delhi schools reduced  Delhi School Winter Vacation Announcement

ఈసారి పాఠశాలలకు శీతాకాలపు సెలవులు 6 రోజులు మాత్రమే ఉండనున్నాయి. గతంలో జనవరి ఒకటి నుండి జనవరి 15 వరకు పాఠశాలకు సెలవులు ఇచ్చేవారు. అయితే ప్రభుత్వ తాజా ఉత్తర్వుల ప్రకారం పాఠశాలలు జనవరి ఒకటి నుండి జనవరి ఆరు వరకు మాత్రమే మూసివేయనున్నారు. 

చదవండి: School Holidays: తుఫాన్‌ ప్రభావం దృష్ట్యా విద్యాలయాలకు సెలవు

ఢిల్లీలో గాలి నాణ్యత తక్కువగా ఉన్నందున ఢిల్లీ ప్రభుత్వం ఇప్పటికే నవంబర్ 9 నుండి నవంబర్ 18 వరకు అన్ని పాఠశాలలకు సెలవులు ఇచ్చింది. అందుకే పిల్లల చదువులను దృష్టిలో ఉంచుకుని ఈసారి శీతాకాలపు సెలవులను తగ్గించాలని నిర్ణయించారు. ఢిల్లీ ప్రభుత్వం జారీ చేసిన సర్క్యులర్‌లో.. 2023-24 అకడమిక్ సెషన్‌లో శీతాకాలపు సెలవులు జనవరి ఒకటి నుండి జనవరి ఆరు వరకు ఉండనున్నాయని పేర్కొన్నారు.

చదవండి: School Holidays: డిసెంబ‌ర్ 22 నుంచి 26వ తేదీ వరకు పాఠశాలలకు సెలవు.. ఎందుకంటే..

Published date : 07 Dec 2023 03:18PM

Photo Stories