Skip to main content

Awards: విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు

awards for students

బళ్లారిఅర్బన్‌: కర్ణాటక రాష్ట్ర వైజ్ఞానిక సంశోధన పరిషత్‌ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి ద్వితీయ వైజ్ఞానిక సమ్మేళన– 2023 కార్యక్రమంలో భాగంగా ఎస్‌ఎస్‌ఎల్‌సీ, పీయూసీ విజ్ఞానంలో ఎక్కువ మార్కులు సాధించిన విద్యార్థులకు ప్రతిభ పురస్కారాల కార్యక్రమాన్ని కొట్టూరు మఠం శ్రీ సిద్దలింగ శివాచార్య స్వామిజీ సమక్షంలో జానపద కళాకారుల సంఘం జిల్లాధ్యక్షుడు టీహెచ్‌ఎం బసవరాజు జ్యోతిని వెలిగించి ప్రారంభించారు. విద్యార్థులు ఉత్సాహంగా మరిన్ని ఫలితాలు సాధించాలంటే ఇలాంటి సంఘం సంస్థలు ప్రతిభ పురస్కారాలతో పోత్సహించడం హర్షనీయం అన్నారు. కార్యక్రమంలో మంత్రి నాగేంద్ర తనయుడు వెంకటేష్‌ప్రసాద్‌, రాష్ట్ర వైజ్ఞానిక సంశోధన పరిషత్‌ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్‌.హులికల్‌ నటరాజ్‌, జిల్లాధ్యక్షులు ఆర్‌హెచ్‌ఎం.చెన్నబసవస్వామి, ఉపాధ్యక్షులు ఎస్‌వై కట్టెగౌడ, సంచాలకుడు సంగయ్య మల్లయ్య హిరేమఠ, కార్యదర్శి గురురాజ్‌, కోశాధికారి డాక్టర్‌.ప్రదీప్‌, సహకార్యదర్శి దేవరాజ్‌, ప్రముఖుడు కసాప జిల్లాధ్యక్షులు నిష్టిరుద్రప్ప పాల్గొన్నారు.

Sports School Admission 2023-24: క్రీడా పాఠశాలలో ప్రవేశాలకు ఎంపిక పోటీలు

Published date : 07 Aug 2023 03:31PM

Photo Stories