Sports School Admission 2023-24: క్రీడా పాఠశాలలో ప్రవేశాలకు ఎంపిక పోటీలు
Sakshi Education
అరకులోయ రూరల్: క్రీడా పాఠశాలలో ప్రవేశాలకు సంబంధించి ఎంపిక పోటీలు స్థానిక క్రీడా పాఠశాలలో శుక్రవారం ప్రారంభమయ్యాయి. వీటిని ట్రైబల్ వెల్ఫేర్ క్రీడా అధికారి శ్యామ్‌సుందర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2023–24 విద్యాసంవత్సరానికి సంబంధించి 5వ తరగతిలో ఖాళీగా ఉన్న 30 సీట్లకు 54 మంది విద్యార్థులు ఎంపిక పోటీల్లో పాల్గొన్నారన్నారు. ఈ కార్యక్రమంలో ట్రైబల్ వెల్ఫేర్ అకాడమి మానటరింగ్ అధికారి రఘనాథ్, క్రీడా పాఠశాల ప్రిన్సిపాల్ పీఎస్‌ఎన్ మూర్తి, పీడీలు లక్ష్మణమూర్తి, సత్యనారాయణ, సునీల్‌బాబు, వెంకటరెడ్డి, కోచ్‌లు గణపతి, రాజుబాబు, మాధవ్, సూరిబాబు తదితరులు పాల్గొన్నారు.
Admissions in Sports School: స్పోర్ట్స్ స్కూల్‌లో ప్రవేశానికి దరఖాస్తు చేసుకోండి
Published date : 05 Aug 2023 03:25PM