Navodaya Entrance Exam : నవోదయలో ప్రవేశ పరీక్షకు దరఖాస్తుల గడువు పొడగింపు.. ఈ తరగతి విద్యార్థులే అర్హులు..
అనంతపురం: లేపాక్షి నవోదయ పాఠశాలలో 2025–26 విద్యా సంవత్సరంలో ఆరో తరగతి ప్రవేశానికి నిర్వహించే పరీక్ష కోసం దరఖాస్తు గడువు అక్టోబరు 7 వరకు పొడిగించారు. www. navodaya.gov.in వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని జిల్లా విద్యాశాఖ అధికారి బి.వరలక్ష్మి ఓ ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం 5వ తరగతి చదువుతున్న విద్యార్థులు మాత్రమే అర్హులని పేర్కొన్నారు. జిల్లా వాసులకు మాత్రమే అవకాశం అన్నారు.
హెచ్‌ఎం/ ప్రిన్సిపాల్ జారీ చేసిన స్టడీ సర్టిఫికెట్లు అప్‌లోడ్ చేయాల్సి ఉంటుందని తెలిపారు. ప్రభుత్వ/ ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో 3, 4వ తరగతి చదివి ఉత్తీర్ణత సాధించి ఉండాలని, 01–05–2013 నుంచి 31– 07–2015 మధ్య జన్మించిన విద్యార్థులు అర్హులని తెలిపారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వివిధ కేటగిరీల్లో రిజర్వేషన్లు ఉంటాయన్నారు. మరిన్ని వివరాలకు వెబ్‌సైట్‌ను సంప్రదించాలని సూచించారు.
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
Tags
- Navodaya Admissions
- Applications
- date extended
- october 7th
- Entrance Exams
- navodaya admission test
- sixth students
- new academic year
- online applications
- sixth class admissions
- sixth class admissions at navodaya
- Admissions 2024
- navodaya admission exams
- Education News
- Sakshi Education News
- LepakshiNavodayaSchool
- ClassVIAdmission
- 202526AcademicYear
- AnantapurAdmissions
- NavodayaEntranceExam
- DistrictEducationOfficer
- 5thStandardEligibility
- AnantapurStudents
- NavodayaGovIn
- SchoolAdmissions
- latest admissions in 2024
- sakshieducation admissions in 2024