Skip to main content

Telangana: బడులకు నిర్వహణ నిధులు.. విద్యార్థుల సంఖ్య నిధులు కేటాయింపు ఇలా..

పరిగి: ప్రభుత్వ పాఠశాలల నిర్వహణకు ప్రభుత్వం మొదటి విడత నిధులు విడుదల చేసింది. 2023 జూన్‌ 12 నుంచి పాఠశాలలు ప్రారంభం కావడంతో విద్యార్థులు బడిబాట పట్టారు.
Telangana
బడులకు నిర్వహణ నిధులు.. విద్యార్థుల సంఖ్య నిధులు కేటాయింపు ఇలా..

కానీ ప్రభుత్వ పాఠశాలల్లో మాత్రం సుద్దముక్క కొనుగోలుకు కూడా పైసలు లేకపోవడంతో ఇబ్బందికరంగా మారింది. ప్రతీ విద్యాసంవత్సరం ప్రారంభంలో ప్రభుత్వ పాఠశాలలను నిధుల కొరత వేధిస్తోంది. దశాబ్ది ఉత్సవాల సందర్భంగానైనా నిధులు సకాలంలో విడుదలవుతాయని ఆశించినా ఫలితం లేకుండా పోయింది. మరో వైపు అన్ని ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు బడిబాట కార్యక్రమం నిర్వహించారు.

కరపత్రాలు, ఫ్లెక్సీలకు ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు సొంత ఖర్చుతో పనులను నిర్వహించారు. ఎట్టకేలకు ఈ విద్యాసంవత్సరం 2023–24లో పాఠశాల శుభ్రత, ఇతర నిర్వహణకు ప్రభుత్వం మొదటి విడత నిధులను విడుదల చేసింది. ఆయా పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను బట్టి తొలి విడతగా 50శాతం నిధులు మంజూరయ్యాయి.

చదవండి: నోటీసు బోర్డులో ఫీజుల వివరాలు తప్పనిసరి

నిధుల మంజూరు ఇలా

జిల్లాలో మొత్తం 1,060 ప్రభుత్వ పాఠశాలలుండగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను బట్టి పాఠశాలల నిర్వహణ నిధులు మంజూరు చేస్తోంది. రెండు విడతల్లో నిధులు కేటాయిస్తారు. సుద్దముక్కలు, తరగతి గదులు శుభ్రం చేసే చీపుర్లు, రిజిస్టర్లు ఇతర ఖర్చుల కింద నిధులు వినియోగిస్తారు. ప్రాథమిక, పాథమికోన్నత, ఉన్నత పాఠశాలలకు విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా నిధులు కేటాయిస్తారు.

చదవండి: Teachers: ఉపాధ్యాయులను సర్దుబాటు చేయాలి

హెచ్‌ఎంలకు తప్పనున్న భారం.

బడిబాట, ఇతర కార్యక్రమాల నిర్వహణ, స్టేషనరి ఇతర బిల్లులకు ఖర్చు చేసేందుకు ప్రధానోపాధ్యులే డబ్బులు ఖర్చు చేశారు. పాఠశాలల నిర్వహణ నిధుల కోసం ఎదురుచూశారు. విద్యాసంవత్సరం ప్రారంభంలో పాఠశాలల్లో ఉన్న చిన్న మరమ్మతులు చేసేందుకు ప్రధానోపాధ్యాయులు ఇబ్బంది పడుతున్నారు. మరో వైపు ఇన్‌చార్జి ప్రధానోపాధ్యాయులుగా ఉన్న చోట బడుల నిర్వహణకు డబ్బులు లేని కారణంగా వారు పలు కార్యక్రమాలు నిర్వహించలేదనే వాదనలు వినిపించాయి.

ప్రభుత్వం స్కూల్‌ గ్రాంటు నిధులతో పాటు, స్పోర్ట్స్‌ గ్రాంటు నిధులు విడదల చేయడం క్రీడాకారులకు ఉపశమనం కలిగిస్తోంది. 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు, 6వ తరగతి నుంచి 10వ తరగతికి సమగ్ర శిక్ష అభియాన్‌(ఎస్‌ఎస్‌ఏ) కింద ఇండోర్‌, అవుట్‌డోర్‌ గేమ్‌ల కోసం క్రీడా పరికరాలు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ప్రాథమిక పాఠశాలలకు రూ.5వేలు, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలకు రూ.10వేల చొప్పున నిధులు కేటాయించారు. ఈ విద్యాసంవత్సరానికి సంబంధించిన క్రీడా నిధులు మొదటి విడతలో 50శాతం మంజూరయ్యాయని అధికారులు వెల్లడించారు.

చదవండి: పేద విద్యార్థుల ఉన్నత భవిష్యత్‌కు దీవెన
పాఠశాలల నిర్వహణకు ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. పాఠశాలలు ప్రారంభించి నెల రోజులు గడుస్తున్నా నిధులు లేక ప్రధానోపాధ్యాయులు ఇబ్బంది పడ్డారు. మొదటి విడతలో భాగంగా 50శాతం నిధులు విడుదలయ్యాయి.

విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం

తొలివిడతలో 50శాతం
స్పోర్ట్స్‌ గ్రాంట్‌లు సైతం మంజూరు

నిధుల కేటాయింపు విద్యార్థుల సంఖ్య నిధులు

1 నుంచి 30 రూ.10వేలు
31 నుంచి 100 రూ.25వేలు
101 నుంచి 250 రూ.50వేలు
251 నుంచి
వేయి మందికిపైగా రూ.1లక్ష
ఎస్‌ఎంసీ తీర్మానం మేరకు ఖర్చు

ప్రభుత్వం స్కూల్‌, స్పోర్ట్స్‌ గ్రాంట్‌ నిధులు విడుదల చేసింది.మార్గదర్శకాలకు అనుగుణంగా నిధులు వినియోగించుకోవాలి. వార్షిక గ్రాంట్‌లో 50శాతం నిధులే మంజూరయ్యాయి. ఎస్‌ఎంసీ తీర్మానం మేరకు నిధులు ఖర్చు చేయాలి.
– హరిశ్చందర్‌, మండల విద్యాధికారి, పరిగి

Published date : 29 Jul 2023 03:48PM

Photo Stories