సీతంపేట: బాలల హక్కుల పరిరక్షణలో మండల విద్యాశాఖాధికారులు, క్లస్టర్ రిసోర్స్ మొబైల్ టీచర్ల పాత్ర కీలకమని రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యుడు గొండు సీతారాం అన్నారు.
నోటీసు బోర్డులో ఫీజుల వివరాలు తప్పనిసరి
అక్కయ్యపాలెం ఎన్జీజీవోస్ కాలనీలోని జీవీఎంసీ ప్రాథమిక పాఠశాల ఆవరణలోని సీతమ్మధార ఎంఈవో కార్యాలయంలో ఎంఈవోలు, క్లస్టర్ రిసోర్స్ మొబైల్ టీచర్ల వ్యవస్థలపై శుక్రవారం సమీక్ష సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సీతారాం మాట్లాడుతూ ప్రతి విద్యార్థి తల్లిదండ్రులు స్కూల్‌లో ఫీజుల వివరాలు తెలుసుకోవడం తమ హక్కు అని తెలిపారు. నోటీసు బోర్డులో ఫీజుల వివరాలు బహిర్గతం చేయాలని, అలా చేయని పాఠశాలలపై చర్యలు తీసుకోవాలన్నారు. ఈ ఏడాది ఉచిత విద్యా నిర్బంధ హక్కు చట్టం ప్రకారం ప్రభుత్వం కేటాయించిన సీట్ల వివరాలు నోటీస్ బోర్డులో పెట్టాలని సూచించారు. సీతమ్మధార ఎంఈవో డి.రామారావు, ఎంఈవో–2 బాలామణి, చైల్డ్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టు అధికారి శ్రీలత, జిల్లా బాలల సంరక్షణ అధికారి రమేష్ తదితరులు పాల్గొన్నారు.