Teachers: ఉపాధ్యాయులను సర్దుబాటు చేయాలి
Sakshi Education
కరీంనగర్: ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరతను దృష్టిలో పెట్టుకొని మిగులుబాటుగా ఉన్న టీచర్లను వెంటనే సర్దుబాటు చేయాలని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం(తపస్) నాయకులు కోరారు.
ఈ మేరకు జూలై 28న కలెక్టర్ బి.గోపికి వినతిపత్రం అందజేశారు. విద్యార్థులు ఉండి, ఉపాధ్యాయుల లేని, ఉపాధ్యాయులు ఉండి, విద్యార్థులు లేని సర్కారు బడులపై జిల్లా విద్యాశాఖ నివేదిక తెప్పించుకొని, బోధనకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలన్నారు.
చదవండి: DSC 2003: టీచర్లకు పాత పెన్షన్ ఇప్పిస్తాం
ఉద్యోగ, ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులు తదితర సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని విన్నవించగా ఆయన సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు. నాయకులు కట్ట రాజశేఖర్, గన్నమనేని రంగారావు, తిరుపతిరావు, విజయధర్‌రాజు, శ్రీనివాస్, రాజేశ్వర్‌రావు, అచ్యుతరెడ్డి, శ్రీనివాస్, శంకరయ్య, శ్రీకాంత్, ఓదెల, శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.
చదవండి: Teacher Education System: మా‘స్టార్లు’గా మార్చేందుకు..
Published date : 29 Jul 2023 03:12PM