DSC 2003: టీచర్లకు పాత పెన్షన్ ఇప్పిస్తాం
Sakshi Education
కామారెడ్డి అర్బన్: డీఎస్సీ–2003 ఉపాధ్యాయులకు పాత పెన్షన్‌ను ఆగస్టులోగా ఇప్పిస్తామని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కె.రఘోత్తమరెడ్డి అన్నారు.
జూలై 27న పీఆర్‌టీయూ ఆధ్వర్యంలో డీఎస్సీ–2003 పాత పెన్షన్ పోరాట సమితి నాయకులు ఎమ్మెల్సీ రఘోత్తమరెడ్డితో పాటు పలువురిని కలిశారు. పీఆర్‌టీయూతోనే ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కారం అవుతాయని జిల్లా అధ్యక్షుడు పి.దామోదర్‌రెడ్డి అన్నారు. పాత పెన్షన్ ఇప్పించే బాధ్యత పీఆర్‌టీయూదేనని యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు పి.శ్రీపాల్‌రెడ్డి అన్నారు. పాత పెన్షన్ పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు శ్రీకాంత్, బాధ్యులు దుర్గాప్రసాద్, రాజు, నాగరాజు, అనిల్, సంగెం శ్రీనివాస్ తదితరులున్నారు.
చదవండి:
ఆగస్టులో మెగా డీఎస్సీ-2023 నోటిఫికేషన్.. అలాగే ఈ ఉద్యోగాలకు వయోపరిమితిని..
Published date : 28 Jul 2023 03:49PM