Skip to main content

Teachers: 40 మంది ఉపాధ్యాయులకు పీఆర్‌టీయూ సత్కారం

PRTU felicitates 40 teachers

రోలుగుంట : ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం, సంక్షేమమే లక్ష్యంగా తమ యూనియన్‌ పనిచేస్తోందని ఉమ్మడి విశాఖ జిల్లా పీఆర్టీయూ జిల్లా ఆధ్యక్షుడు డి.జి.నాఽథ్‌, ప్రధాన కార్యదర్శి మడ్డు శ్రీను అన్నారు. రోలుగుంట మండలం నుంచి ఇటీవల బదిలీ అయిన 40 మంది ఉపాధ్యాయులతో మండల పీఆర్టీయూ ఆత్మీయ కలియక సమావేశం ఏర్పాటు చేసి వారిని ఘనంగా సత్కరించారు. కూడిన సత్కార సభ బుధవారం రాత్రి ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా యూనియన్‌ కార్యకలాపాల గురించి వివరించారు. వైఎస్సార్‌ హయాంలో నాలుగు సంవత్సరాల ఉపాధ్యాయ అప్రెంటిషిప్‌ను రెండు సంవత్సరాలకు మార్చడంలో పీఆర్టీయూ కృషి గురించి వివరించారు. ప్రస్తుతం జిల్లాలో అతిపెద్ద యూనియన్‌గా పీఆర్టీయూ ఉందన్నారు. కార్యక్రమంలో యూనియన్‌ జిల్లా ఉపాధ్యక్షుడు బుడ్డిగ అప్పారావు, మండల యూనియన్‌ అధ్యక్షుడు జి.వి.రమణ తదితరులు పాల్గొన్నారు.

KGBVల్లో టీచర్లను కొనసాగించాలి.. ఖాళీగా పీజీటీ పోస్టులు

Published date : 04 Aug 2023 03:34PM

Photo Stories