Skip to main content

AP DSC 2023 Notification: ఆగ‌స్టులో మెగా డీఎస్సీ-2023 నోటిఫికేష‌న్‌.. అలాగే ఈ ఉద్యోగాల‌కు వ‌యోప‌రిమితిని..

సాక్షి ఎడ్యుకేష‌న్ : కొన్ని వేల మంది ఎప్పుడెప్పుడా ఎన్ని ఎదురుచూస్తున్న ఏపీ డీఎస్సీ నోటిఫికేష‌న్‌కు లైన్ క్లియ‌ర్ అయ్యేలా క‌న్పిస్తుంది.
AP DSC 2023 Notification News  Details
AP DSC 2023 Notification

ఆగ‌స్టులో మెగా డీఎస్సీ విడుదలతో పాటు త్వరలో అన్ని ప్రభుత్వ శాఖల్లోని ఖాళీలను భర్తీ చేస్తామని విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ జూలై 21వ తేదీన‌(శుక్ర‌వారం) హామీ ఇచ్చినట్లు ఏపీ నిరుద్యోగ జేఏసీ అధ్యక్షుడు సమయం హేమంత్‌ కుమార్‌ చెప్పారు. జూలై 21వ తేదీన (శుక్రవారం) విజయవాడలో మంత్రి బొత్సను కలిసి నిరుద్యోగుల సమస్యలపై వినతిపత్రమిచ్చారు.

☛ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ డీఎస్సీ/టెట్‌ స్డ‌డీ మెటీరియ‌ల్‌, బిట్‌బ్యాంక్‌, మోడ‌ల్‌పేప‌ర్స్‌, ప్రీవియ‌స్ పేప‌ర్స్‌, గైడెన్స్‌, ఆన్‌లైన్ టెస్టులు, స‌క్సెస్ స్టోరీలు మొద‌లైన వాటి కోసం క్లిక్ చేయండి

ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ అభ్యర్థులకు..
అలాగే ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ అభ్యర్థులకు ఇటీవల జరిగిన ప్రాథమిక పరీక్షలో తప్పుదొర్లిన ప్రతి ప్రశ్నకి ఒక మార్కు కేటాయించాలని కోరారు. జాబ్‌ క్యాలెండర్, మెగా డీఎస్సీ, డిజిటల్‌ గ్రంథాలయ శాఖ, పోలీసు విభాగాల్లో పోస్టులకు నోటిఫికేషన్‌ ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు.

☛ NESTS: డిగ్రీ, బీఈడీ అర్హ‌త‌తో 6329 ఉద్యోగాలు... ప్రారంభ వేత‌నం రూ.45 వేలు.. వివ‌రాల‌కు క్లిక్ చేయండి

ఈ ఉద్యోగాల‌కు వ‌యోప‌రిమితిని..

botsa satyanarayana

జనరల్‌ కేటగిరీల్లో వయోపరిమితిని ఏపీపీఎస్సీ, డీఎస్సీ అభ్యర్థులకు 47 ఏళ్లకు, కానిస్టేబుల్‌కు 27 ఏళ్లకు, ఎస్‌ఐ అభ్యర్థులకు 30 ఏళ్లకు, ఫైర్, జైలు వార్డెన్స్‌ అభ్యర్థులకు 32 ఏళ్లకు పెంచాలని కోరారు. హోంగార్డులకు జనరల్‌ అభ్యర్థులతో కాకుండా ప్రత్యేకంగా రాత పరీక్ష పెట్టాలన్నారు. దీనిపై మంత్రి సానుకూలంగా స్పందిస్తూ సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానని హామీ ఇచ్చారని చెప్పారు.

Andhra Pradesh : ఇక‌పై ఉపాధ్యాయులు ఎవరైనా సెలువులో ఉంటే వీరి స్థానంలో.. కొత్త‌గా..

Published date : 22 Jul 2023 06:49PM

Photo Stories