PRTU: ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి
Sakshi Education
కాళోజీ సెంటర్: ఎన్నికల విధులు నిర్వర్తించే ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని పీఆర్‌టీయూ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కొలిపాక సంగీత, కొండ్రెడ్డి శ్రీనివాస్‌రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
పీఆర్‌టీయూ రాష్ట్ర అధ్యక్షుడు గాల్‌రెడ్డి హర్షవర్ధన్‌రెడ్డి పిలుపు మేరకు ఏప్రిల్ 2న జిల్లా కమిటీ బాధ్యులు అదనపు కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు.
చదవండి: Gurukul School Principal: ప్రిన్సిపాల్‌పై విద్యార్థులు, అధ్యాపకుల ఫిర్యాదు..! కారణం..
కార్యక్రమంలో పీఆర్‌టీయూ జిల్లా కోశాధికారి సర్వేశ్వర్, రాయపర్తి మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు నవీన్‌కుమార్,జె.సునీల్, హనుమకొండ జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటేష్ రావులకార్ తదితరులు పాల్గొన్నారు.
Published date : 04 Apr 2024 11:17AM