PRTU: ఉపాధ్యాయ బదిలీలు, పదోన్నతులు చేపట్టాలి
నవంబర్ 7న రాత్రి జిల్లాకేంద్రంలోని ఓ ప్రైవేటు హాల్‌లో సంఘం అధ్యక్షుడు మహిపాల్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి శ్రీనివాసులు ఆధ్వర్యంలో జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఆయన హాజరై మాట్లాడారు. పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు ఉపాధ్యాయ ఖాళీలను వెంటనే భర్తీ చేయాలన్నారు. వివిధ రకాల బకాయి బిల్లులను ఈ నెల 15లోగా చెల్లించాలని కోరారు.
అనంతరం సంఘం జిల్లా కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. కార్యక్రమంలో సంఘం రాష్ట్ర సహ అధ్యక్షుడు ప్రతాప్‌రెడ్డి, పల్లా శ్రీనివాసులు, హేమలత, మహబూబ్‌నగర్ జిల్లా అధ్యక్షుడు బాలరాజు, రంగారెడ్డి, కేశవులు, ఉపాధ్యాయులు విష్ణు, జి.ప్రవీణ్‌రెడ్డి, నాగరాజు, పి.సురేష్‌కుమార్, లోకారెడ్డి, సరస్వతి, అనిత, రాణి, జైపాల్‌రెడ్డి, సి.ఈశ్వర్, వి.రాజేశ్వరి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
చదవండి: DEO: ఉపాధ్యాయులు సమయపాలన పాటించకుంటే కఠిన చర్యలు
జిల్లా కార్యవర్గం..
పీఆర్టీయూ తెలంగాణ జిల్లా కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఎన్నికల పరిశీలకులుగా సంఘం మహబూబ్‌నగర్ జిల్లా అధ్యక్షులు బాలరాజు, రంగారెడ్డి, కేశవులు వ్యవహరించారు.
అధ్యక్షుడిగా టి.మహిపాల్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా ఆర్.శ్రీనివాసులు, సహ అధ్యక్షులుగా విష్ణు, జి.ప్రవీణ్‌రెడ్డి, ఉపాధ్యక్షులుగా నాగరాజు, పి.సురేష్‌కుమార్, లోకారెడ్డి, మహిళా ఉపాధ్యక్షులుగా సరస్వతి, అనితారాణి, కార్యదర్శులుగా జైపాల్‌రెడ్డి, సి.ఈశ్వర్, మహిళా కార్యదర్శులుగా వి.రాజేశ్వరి ఎన్నికయ్యారు.