DEO: ఉపాధ్యాయులు సమయపాలన పాటించకుంటే కఠిన చర్యలు
రాయచోటిటౌన్: సమయపాలన పాటించకుంటే కఠిన చర్యలు తప్పవని డీఈవో శ్రీరాం పురుషోత్తం ఉపాధ్యాయులను హెచ్చరించారు. నవంబర్ 7న రాయచోటి పట్టణంలోని కొత్తపల్లెలోని ఉర్దూ ఉన్నత పాఠశాలను మధ్యాహ్నం 1:30 గంటల సమయంలో అకస్మిక తనిఖీ చేశారు. ఆ సమయంలో ఉపాధ్యాయులు కొంత మంది ఉపాధ్యాయులతో పాటు ప్రధానోపాధ్యాయుడు కూడా ఆ పాఠశాలలో లేరు. కొద్దిసేపటికి పాఠశాలకు డీఈవో వచ్చారనే విషయం తెలుసుకున్న ఒక్కొక్కరే ఉపాధ్యాయులు రావడంపై అగ్రహం వ్యక్తం చేశారు. అలాగే 10వ తరగతి గదిలోకి వెళ్లి పాఠ్యాంశాలపై విద్యార్థులను పలు ప్రశ్నలు వేశారు. సరైన సమాధానాలు చెప్పలేకపోవడంతో సంబంధిత ఉపాధ్యాయులను పిలిచి ఇప్పటికీ సరైన బోధన చేయలేదని ఇక్కడ వచ్చేది పేద విద్యార్థులు కాబట్టి వారిని నాణ్యమైన విద్యా బోధన చేయాలని సూచించారు. త్వరలోనే మళ్లీ అకస్మిక తనికీ చేయడానికి వస్తానని అప్పటికై నా విద్యార్థులలో విద్యాప్రమాణాలు మెరుగుపరచాలని సూచించారు. అలాగే మరుగుదొడ్ల పారిశుధ్య నిర్వహణపై కూడా మండిపడ్డారు. అలాగే నాడు – నేడు పనులకు సంబంధించి రికార్డులు తన కార్యాలయానికి తీసుకరావాలని ఆదేశించారు.
చదవండి: Scout students: స్కౌట్ విద్యార్థులు ఆదర్శంగా నిలవాలి