Skip to main content

Scout students: స్కౌట్‌ విద్యార్థులు ఆదర్శంగా నిలవాలి

Scouts District Secretary Madthadi Narasimha Reddy guiding the event, Scouts officers and students meeting with the collector, Scout students should lead by example, 74th Foundation Day of Bharat Scouts and Guides celebration,

రాయచోటి అర్బన్‌: స్కౌట్‌ అండ్‌ గైడ్స్‌ విద్యార్థులు క్రమశిక్షణతో రోల్‌మోడల్‌గా ఎదగాలని కలెక్టర్‌ గిరీషా పియస్‌ ఆకాంక్షించారు. భారత్‌ స్కౌట్‌అండ్‌ గైడ్స్‌ 74వ ఫౌండేషన్‌ డేపు పురస్కరించుకుని స్కౌట్స్‌ జిల్లా సెక్రటరీ మడితాడి నరసింహారెడ్డి ఆధ్వర్యంలో స్కౌట్‌ అధికారులు, విద్యార్థులు కలెక్టర్‌ను కలిశారు. స్కౌట్‌అండ్‌ గైడ్స్‌ ఫౌండేషన్‌ డే స్టిక్కర్ల పోస్టర్‌ను అందచేశారు.

చ‌ద‌వండి: NCC: ఎన్‌సీసీ కోసం విద్యార్థినుల ఎంపిక

స్కౌట్‌ అండ్‌ గైడ్స్‌ శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి: ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి
స్కౌట్‌ అండ్‌ గైడ్స్‌ శిక్షణను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి కోరారు. స్కౌట్స్‌ జిల్లా సెక్రటరీ మడితాడి నరసింహారెడ్డి ఆధ్వ ర్యంలో స్కౌట్‌ అధికారులు, విద్యార్థులు ఎమ్మెల్యేను కలిశారు. ఈసందర్బంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులలో దేశభక్తి, నైతికవిలువలు ,సామాజిక సేవాతత్వం పెంపొందడానికి స్కౌట్‌ శిక్షణ తోడ్పడుతుందన్నారు. ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి, జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీరాం పురుషోత్తం, డిప్యూటీ ఈఓ వరలక్ష్మి పాల్గొన్నారు.

Published date : 08 Nov 2023 03:01PM

Photo Stories