NCC: ఎన్‌సీసీ కోసం విద్యార్థినుల ఎంపిక
తెనాలిః ఎన్‌సీసీ 10వ ఆంధ్రా బాలికల బెటాలియన్‌లోకి ఎన్‌సీసీ క్యాడెట్ల ఎంపికను నవంబర్ 7న స్థానిక జేఎంజే మహిళా కాలేజిలో నిర్వహించారు. ఆసక్తి గల డిగ్రీ ఫస్టియర్ విద్యార్థినులకు శారీరక పరీక్షల్లో భాగంగా పరుగు పోటీలు జరిపారు. అనంతరం పలువురు విద్యార్థినులను ఎంపిక చేశారు. కాలేజి దశలో విద్యార్థినుల్లో దేశభక్తిని పెంపొందించేందుకు ఎన్‌సీసీ బాగా ఉపకరిస్తుందని ఈ సందర్భంగా ఎన్‌సీసీ అధికారి వై.శారా సూసన్ అన్నారు. వ్యక్తిగత జీవితంలో క్రమశిక్షణ, శారీరక దృఢత్వం అలవడుతుందని చెప్పారు. కాలేజి ప్రిన్సిపాల్ డాక్టర్ సిస్టర్ షైనీ కేపీ, వైస్‌ప్రిన్సిపాల్ డాక్టర్ సిస్టర్ మేరీ శారద పాల్గొన్నారు.
బ్యాక్‌లాగ్ ఉద్యోగాల ఫైనల్ మెరిట్ జాబితా విడుదల
నెహ్రూనగర్: విభిన్న ప్రతిభావంతుల బ్యాక్‌లాగ్ ఉద్యోగాలకు సంబంఽధించిన ఫైనల్ మెరిట్ జాబితా విడుదల చేసినట్లు విభిన్న ప్రతిభావంతుల, ట్రాన్స్‌జెండర్స్, వృద్ధుల సంక్షేమ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ సువార్త నవంబర్ 7న ఓ ప్రకటనలో తెలియజేశారు. వివిధ శాఖల్లో 2022–23 సంవత్సరానికి విభిన్న ప్రతిభావంతులు(దృష్టి లోపం) గల దివ్యాంగుల కేటగిరీలకు సంబంధించిన ఆఫీస్ సబార్డినేట్, వాచ్‌మెన్ కం–హెల్పర్, నైట్ వాచ్‌మెన్, బంగ్లా వాచర్, స్కావెంజర్, బేరర్ మొదలగు విభిన్న ప్రతిభవాంతుల బ్యాక్‌లాగ్ ఉద్యోగాల ఫైనల్ మెరిట్ జాబితాను జిల్లా అధికారిక వెబ్‌సైట్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.గుంటూరు.ఏపీ.జీఓవీ.ఇన్ నందు, బృందావన్‌గార్డెన్స్‌లోని సంక్షేమ శాఖ కార్యాలయంలో నోటీసు బోర్డు నందు ఉంచడం జరిగిందన్నారు.
చదవండి: Staff Nurse Jobs: తుది మెరిట్ జాబితా విడుదల
ఒరిజినల్ మెరిట్ లిస్టు విడుదల
గుంటూరు మెడికల్ : ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్ జిల్లా ఆసుపత్రుల సమన్వయకర్త కార్యాలయం పరిధిలో ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్నవారి ప్రొవిజనల్ మెరిట్ లిస్టును నవంబర్ 7న విడుదల చేసినట్లు జిల్లా ఆసుపత్రుల సమన్వయకర్త డాక్టర్ సుబ్రహ్మణ్యరాజు తెలిపారు. ప్రొవిజనల్ మెరిట్ లిస్టులో ఏమైనా అభ్యంతరాలు ఉంటే నవంబర్ 9న తేదీ సాయంత్రం 5 గంటల్లోపు గుంటూరు డీఎంహెచ్‌ఓ కార్యాలయం ప్రాంగణంలోని తమ కార్యాలయంలో నేరుగా అందజేయాలన్నారు. ప్రొవిజనల్ మెరిట్ లిస్టును గుంటూరు.ఏపీ.జీవో.ఇన్ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు వెల్లడించారు.
Tags
- NCC
- Female Students for NCC
- NCC 10th Andhra Girls Battalion
- Education News
- andhra pradesh news
- NCC Cadets
- Tenalih NCC 10th Andhra Girls Battalion
- JMJ Mahila College
- Physical Tests
- Degree first-year students
- Patriotism
- Female students
- Physical strength
- Personal development
- Sakshi Education Latest News